బహుజనుల మార్గదర్శి పూలే * బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ * ఘనంగా పూలే 196వ జయంతి వేడుకలు
బహుజనుల మార్గదర్శి పూలే
* బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్
* ఘనంగా పూలే 196వ జయంతి వేడుకలు
భద్రాద్రి కొత్తగూడెం అక్షిత ప్రతినిధి:
భారత దేశంలో సాంఘిక సంస్కరణల కోసం మొట్టమొదట పోరాటం మొదలు పెట్టిన సామాజిక విప్లవకారుడు బహుజనుల మార్గదర్శి మహాత్మా జ్యోతిరావు పూలే అని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ అన్నారు. పూలే 196వ జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన జయంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరై పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ కులం కట్టుబాట్లు మత విశ్వాసాలు మూఢ నమ్మకాలతో శూద్రులను స్త్రీలను అణచివేతకు గురిచేస్తున్న సమయంలో వీటన్నింటినీ రూపుమపాలంటే విద్య మాత్రమే సరైన ఆయుధామని భావించిన మహోన్నత వ్యక్తి అని పూలే దంపతులు 54 విద్యాలయాలను నిర్మించారని కొనియాడారు. సతీసహగమనాలకు వ్యతిరేకంగా పోరాడిన మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అసెంబ్లీ మహిళా కన్వీనర్ కోలా మల్లికా, కేతిని కుమారి, ఎర్రంశెట్టి రాజేశ్వరి, గంధం శారద, నవ్య సమీరా, మృదు సారిక తదితరులు పాల్గొన్నారు.