రైతు సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ

రైతు సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ

చిట్యాల,అక్షిత ప్రతినిధి: రైతాంగ సమస్యలపై రాజీ లేని పోరాటాలు చేస్తున్నది రైతు సంఘం అని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఐతరాజు నర్సింహ అన్నారు. అఖిల భారత కిసాన్ సభ (ఎఐకెఎస్)88 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చిట్యాల లో మంగళవారం నాడు రైతు సంఘం జంఢాను ఆయన ఆవిష్కరించటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని రైతులు పోరాడిన ఫలితంగా ప్రభుత్వం దిగివచ్చింది ఆని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, రైతు సంఘం మండల అధ్యక్షులు లడే రాములు, వివిధ ప్రజా సంఘాల నాయకులు నారబోయ్న శ్రీనివాసులు, శీలా రాజయ్య, రుద్రారపు పెద్దులు,అక్కనపల్లి నాగయ్య, గుడిసె లక్ష్మి నారాయణ, కడగంచి నర్సింహ, పి సురేష్, రమేష్, శ్రవణ్, రాములు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking