నీర్నెములలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

నీర్నెములలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

నకిరేకల్ అక్షిత ప్రతినిధి:

రామన్నపేట మండలం నీర్నెముల గ్రామంలో జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా వారి గొప్ప సేవలను స్మరించుకుంటూ గ్రామ సర్పంచ్ ముత్యాల సుజాత రవి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఆవరణ లో ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు..అనంతరం వారు మాట్లాడుతూ వెనుక బడిన వర్గాల కోసం పోరాటం చేసి మొదటి తరం మహనీయుడు, నిరంతరం సమాజంలోని అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త, మహాత్మా జ్యోతిరావు పూలే అన్నారు.సమాజంలో కుల వ్యవస్థ నిర్మూలన, స్త్రీ,పురుషులకు సమాన హక్కుల కోసం ఎంతగానో పోరాడిన సామాజిక యోధుడు మహాత్మా జ్యోతిరావ్ పూలే అని కొనియాడారు.ఈ కార్యక్రమం లో పంచాయతీ కార్యదర్శి ఎదుగాని ఉపేందర్,వార్డు సభ్యులు నాగటి మహేష్, సుర్వి సతీష్, అంగన్వాడీ టీచర్లు మంగమ్మ,సౌజన్య ఆశా వర్కర్లు ఉప్పలమ్మ,కృష్ణవేణి, ఆవుల శ్రీధర్, సుర్వి నరేష్, సుర్వి భాను,ఏబూషి యాదయ్య తదితరులు పాల్గొన్నారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking