బీఎస్పీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు

బీఎస్పీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు

ఖమ్మం/ అక్షిత బ్యూరో :

ఖమ్మం నగరంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలని బహుజన సమాజ్ పార్టీ ఖమ్మం అసెంబ్లీ ఇన్ ఛార్జ్ *జిల్లా కార్యదర్శి అయితగాని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బీఎస్పీ ఖమ్మం జిల్లా ఇన్ ఛార్జ్ డాక్టర్ పిసి.వీరస్వామి మాట్లాడుతూ మానువాదం గులాంగిరి లపై పోరాటం చేసిన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అన్నారు.కులవివక్షత పోవాలని కులనిర్మూలన పోరాటాలు చేసి మొదటి వ్యక్తి పూలే అన్నారు.ఈ కార్యక్రమంలో ముందుగా పూలే చిత్ర పటాన్ని పూలమాలతో నివాళులు అర్పించి కేక్ కట్ చేసినారు.ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు పుల్లారావు సురేష్ భరత్ నాగరాజు అనిత తదితర నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking