కుల వృత్తులకు పూర్వ వైభవం రాష్ట్ర ప్రభుత్వం
ఎమ్మెల్యే జోగురామన్న
ఆదిలాబాద్, అక్షిత బ్యూరో:
కుల వృత్తులకు పూర్వ వైభవం తీసుకువచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. స్థానిక కైలాస్ నగర్ లో ఏర్పాటు చేసిన పట్టణ నాయి బ్రాహ్మణా సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకర మహోత్సవానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను శాలువా, పూల మాలలతో ఘనంగా సత్కరించి వారికి అభినందనలు తెలియచేశారు. అదేవిధంగా సంఘం సభ్యులు ఎమ్మెల్యేను శాలువాలతో సన్మానించారు. అనంతరం పలువురు సభ్యులు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా… వాటి పరిష్కారానికి తన వంతుగా పూర్తి సహకారం అందిస్తానని ఆయన భరోసా కల్పించారు. . ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ.. జనాభాలో 52 శాతం ఉన్న బీసీలు అన్ని రంగాల్లో ముందుండేలా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కార్యాచరణ అమలు చేస్తోందని అన్నారు. తాను బీసీ సంక్షేమ శాఖా మంత్రిగా ఉన్న సమయంలో అన్ని పార్టీల నేతలతో సమావేశాలు ఏర్పాటు చేసి బీసీల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు వెల్లడించారు. ముఖ్యంగా కుల వృత్తులకు తగిన ప్రోత్సాహం అందిస్తూ ఆర్థికంగా ఎదిగేలా పలు కార్యక్రమాలను అమలు చేశామని పేర్కొన్నారు. సంఘం సభ్యులు ప్రస్తావించిన సమస్యల సాధనకు తన వంతుగా పూర్తి సహకారం అందిస్తానని భరోసా కల్పించారు.కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షా ప్రధాన కార్యదర్శులు చిక్కాల దత్తు, కలాల శ్రీనివాస్, నాయకులూ రాము, మెట్టు ప్రహ్లాద్ తదితరులు పాల్గొన్నారు