పంచాయితీ కార్యదర్శుల రక్షణకా ! రైతు-భీమా నామిని రక్షణకా ! ఎంపిఓ తప్పుడు నివేదిక!! – కొమ్ము యాదయ్య మహరాజ్

పంచాయితీ కార్యదర్శుల రక్షణకా !
రైతు-భీమా నామిని రక్షణకా !

ఎంపిఓ తప్పుడు నివేదిక!!

– కొమ్ము యాదయ్య మహరాజ్

నకిరేకల్ అక్షిత ప్రతినిధి:

నార్కట్ పల్లి మండలం అక్కేనపల్లి గ్రామములో మరణ ధృవీకరణ తప్పుడు నమోదు పై ప్రజావాణి ఫిర్యాదుపై విచారణ అధికారి అయిన ఎంపిఓ బాధ్యతను విస్మరించి పంచాయితి కార్యదర్శుల రక్షణకా ,రైతు-భీమా నామినిదారుని రక్షణకా తప్పుడు నివేదికను జిల్లా స్థాయి అధికారులకు పంపుటకు సిద్దంవుతున్నాడని అక్కేనపల్లి ఎఫ్ సి ఎస్ డైైరక్టర్&జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొమ్ము యాదయ్య మహరాజ్ పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో ఆరోపిస్తున్నారు.

పూర్తి స్థాయి విచారణ చేయకుండానే కార్యాదర్శులను క్షేత్ర స్థాయిలో పిలవకుండా,రికార్డులను పరిశీలించకుండనే విచారణ ముగింపు చేయడం అతని బాధ్యత రహితానికి నిదర్శనం అని ఆయన ఆరోపిస్తున్నారు.ఈ విచారణ పూర్వపు కార్యాదర్శులను & రైతు భీమా నామినిదారుని రక్షించాలని తూ..తూ…
మంత్రంగా విచారణ చేశాడని ఆయన అన్నారు.తప్పుడు విచారణ చేసిన ఎంపిఓ పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఈ పత్రిక ప్రకటన లో జిల్లా అధికారులను కోరారు

Leave A Reply

Your email address will not be published.

Breaking