తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయం * బీజేపీ జాతీయమీడియా కోర్దినేటర్ ఓబీసీ కె.వి రంగాకిరణ్ * ఇంటింటికి కరపత్రాలు పంపిణీ
తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయం
* బీజేపీ జాతీయమీడియా కోర్దినేటర్ ఓబీసీ కె.వి రంగాకిరణ్
* ఇంటింటికి కరపత్రాలు పంపిణీ
భద్రాద్రి కొత్తగూడెం అక్షిత ప్రతినిధి:
తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని, కెసిఆర్ నియంత ప్రభుత్వాన్ని అంతమొందించడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని బిజెపి మోర్చా జాతీయ మీడియా కోఆర్డినేటర్ ఓబిసి కెవి రంగా కిరణ్ అన్నారు. బిజెపి జాతీయ పార్టీ పిలుపుమేరకు పల్లె పల్లెకు ఓబీసీ ఇంటింటికి బిజెపి కార్యక్రమాన్నీ బుధవారం అశ్వాపురం మండలం మొండికుంట గ్రామంలో నిర్వహించారు. ఈసందర్భంగా ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెరుగు రవీందర్ ఆధ్వర్యంలో నాయకులు ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఓబీసీల అభివృద్ధి కొరకు అమలు చేస్తున్న పథకాలు నరేంద్రమోదీ చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఓబీసీ జాతీయమీడియా కోర్దినేటర్, ఈ కార్యక్రమం జిల్లా కోర్దినేటర్ కె.వి రంగాకిరణ్ జిల్లా ఓబీసీ అధ్యక్షులు ఆకుల నాగేశ్వరరావు హాజరయ్యారు.

అనంతరం కె.వి రంగాకిరణ్, ఆకుల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీ అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి సంక్షేమ పథకాలు చేపడుతూ దేశ ప్రజల మన్నన పొందుతున్నారని అన్నారు. కరోన విపత్తు కారణంగా గత 2 సంవత్సరాలుగా దేశంలోని నిరుపేదలకు ఉచితంగా రేషన్ అందిస్తుందన్నారు. దేశ ప్రజలందరికీ 5లక్షల వరకు ఉచిత ఆరోగ్య భీమా ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని రూపొందించారని అన్నారు. ప్రజలందరూ కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఓబీసీ జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ పిలుపు మేరకు
దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం ఈనెల 6 నుండి ప్రారంభమై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి 14న పూర్తి పూర్తవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పల్లెలకు నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలను చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలకు తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందన్నారు. ఈకార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు లింగారెడ్డి, ఓబీసీ మండల అధ్యక్షులు గోసుల రాములు, తాటి వెంకన్న, సురేష్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు కొల్లు లింగారెడ్డి, వెంకట్ రెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి చింతలచెర్వు శ్రీనివాసరావు, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షుడు గంధం నాగేంద్ర ప్రసాద్, కోశాధికారి జల్లారపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.