రాజీవ్ గృహకల్ప పేజ్3లో సమస్యలు తెలుసుకునేందుకు పర్యటించిన కార్పొరేటర్.
రాజేంద్రనగర్ అక్షిత ప్రతినిధి:
మైలర్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలోని ఆప్కో కాలనీ , లక్ష్మిగూడా రాజీవ్ గృహకల్ప పేజ్3లో కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ లో ఉన్న సీసీ రోడ్లు, పనులను అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగింది. అలాగే స్థానిక సమస్యల పై శ్రీనివాస్ రెడ్డి విస్తృతంగా పాదయాత్ర చేస్తూ మౌలిక సదుపాయాల కల్పన కోసం కాలనీల లో పర్యటించారు.లక్ష్మీగుడా రాజీవ్ గృహకల్ప పేజ్3లోముఖ్యంగా నీటి కొరత ఉండడం తో బోర్లను వెలికి తీసి భాగు చేయించడం నూతన మోటార్లను బిగించాలని కార్పొరేటర్ అధికారులను ఆదేశించారు. ఆయా కాలనిలలో నెలకొన్న అన్ని సమస్యలను దశల వారీగా శాశ్వతంగా పరిష్కరించడానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. ప్రజా సమస్యల శాశ్వత పరిష్కారమే తన తన కర్తవ్యమని పేర్కొన్నారు.మైలర్ దేవ్ పల్లి డివిజన్ గ్రేటర్ హైదరాబాద్ లోనే అన్ని రంగాల్లో ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చి దిద్దడానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి డి ఈ శంకర్, ఏఈ బల్వంత్ రెడ్డి, జలమండలి శివరాజ్ బోర్డు సూపర్వైజర్ బుచ్చి రెడ్డి,టి. చిన్న, బబ్లూ, ఎల్వి రెడ్డి, తిరుపతమ్మ, సురేష్, రాజు, ఎలక్ట్రిసిటీ సురేందర్ జిహెచ్ఎంసి ఎంటమాలజీ విభాగం సిబ్బంది ఇతర అధికారులు అధికారులు,మరియు బస్తీ వాసులు తదితరులు పాల్గొన్నారు.