శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని పలు వార్డులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.

శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని పలు వార్డులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.
రాజేంద్రనగర్, అక్షిత ప్రతినిధి: శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో పలు వార్డులలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ బుధవారం శంకుస్థాపన చేశారు, మున్సిపల్ చైర్మన్ కొలన్ సుష్మా మహేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్, పార్టీ నేతలతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మున్సిపల్ పరిధిలోని 11.55 లక్షల రూపాయలతో చేపట్టనున్న 4నుంచి 25వ వార్డులలో సిసి రోడ్లు, బీటి రోడ్లు, ఎస్ డబ్ల్యూ డ్రైన్స్ నిర్మాణాలకు ఆయన శంఖుస్థాపన నిర్వహించారు. శంషాబాద్ మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత ఊహించని విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు.

అభివృద్ధి పనులకు అవసరమైన నిధులను కౌన్సిల్ సమావేశంలో తీర్మానించి మంజూరు చేసి ఆయా వార్డులలో అవసరమైన అభివృద్ధి పనులను చేపడుతున్నామని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో
నార్సింగ్ మార్కెట్ కమిటీ చైర్మన్ దూడల వెంకటేష్ గౌడ్, సీనియర్ నాయకులు గణేష్ గుప్తా, మున్సిపల్ కమిషనర్ బోగేశ్వర్లు, స్థానిక వార్డుల కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్లు, మున్సిపల్ ఏఈ ,డిఈ, మరియు సీనియర్ నాయకులు, యువనాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking