వార్డులన్ని కలియ తిరిగిన ఎమ్మెల్యే కూసుకుంట్ల

వార్డులన్ని కలియ తిరిగిన ఎమ్మెల్యే కూసుకుంట్ల

చౌటుప్పల్, అక్షిత ప్రతినిధి :

చౌటుప్పల్ పురపాలక పరిధి లోని 9, 10వ వార్డులలో పర్యటించిన మునుగోడు శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మరియు మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు తో కలసి వార్డుల మొత్తానికి తిరుగుతూ ఆ వార్డులో పూర్తి చేయాల్సినటువంటి సీసీ రోడ్డు నిర్మాణాలు మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం పనులను చేపట్టాలని సంబంధిత అధికారులకు, కాంట్రాక్టర్ కి వివరించారు. తక్షణమే పనులు ప్రారంభించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉపఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం పనులు ప్రారంభించాలని చెప్పడంతో అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సింగల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, కౌన్సిలర్ దండ హిమబిందు అరుణ్ కుమార్, గోపగొని లక్ష్మణ్, బొడిగె బాలకృష్ణ, తాడూరి పరమేష్, బి ఆర్ ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ ముత్యాల ప్రభాకర్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ ఉడుగు మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking