అత్తాపూర్ మారుతినగర్ పాండురంగ నగర్ కాలనీలలో కార్పొరేటర్ పర్యటన.

అత్తాపూర్ మారుతినగర్ పాండురంగ నగర్ కాలనీలలో కార్పొరేటర్ పర్యటన.
రాజేంద్రనగర్ అక్షిత ప్రతినిధి: అత్తాపూర్ డివిజన్ పరిధిలోని మారుతీ నగర్ పాండురంగ నగర్ కాలనీలలో ప్రజా సమస్యలను తెలుసుకుంటూ స్థానిక కార్పొరేటర్ మొండ్ర సంగీత గౌరీ శంకర్ బుధవారం పర్యటించారు. కార్పొరేటర్ సంగీత శంకర్ అన్ని విభాగాల అధికారులతో మారుతీ నగర్, పాండురంగ నగర్ లలో, ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఇంటింటికి తిరిగి ప్రజలను వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులతో బస్తీ వాసులతో పర్యటించడం జరిగింది బస్తీ వాసులు చిన్నచిన్న మౌలిక సదుపాయాలు త్రాగునీరు సరియైన పద్ధతిలో రాకపోవడం సిసి రోడ్లు సరిగా లేకపోవడం వీధిలైట్లు కరెంటు స్తంభాలు ఇతర సమస్యల కొరకు ప్రతి బస్తీల్లో చిన్న చిన్న సమస్యల కొరకై ప్రజల చేత అధికారులకు కార్పొరేటర్ సూచించడం జరిగింది. ప్రజలు కట్టే పన్నులతో అన్ని గవర్నమెంట్ శాఖలు నడుస్తున్నాయని మరి ఈ చిన్న చిన్న సమస్యలు అధికారులు తీర్చకపోవడం చాలా విడ్డూరంగా ఉందని అధికారుల ముందే కార్పొరేటర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇకమీదట ఇలాంటివి పునరావృత్తం కాకుండా చూడాలని వెంటనే ఒక్కొక్క పనిని దశలవారీగా పూర్తిచేయాలని అన్ని శాఖల అధికారులకు విన్నవించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఏ ఈ కృష్ణమూర్తి, నరహరి, పారిశుద్ధ్య విభాగం సూపర్వైజర్ లు రాజు, వినయ్, కృష్ణ, పోలీసు సిబ్బంది వారు మరియు బిజెపి ప్రధాన కార్యదర్శి రాజు పైల్వాన్ బిటుకూరి సిద్దేశ్వర్, సత్యనారాయణముదిరాజ్, పవన్, బస్తీ వాసులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking