సీఎం సహాయ నిధి పేదలకు వరం: ఎమ్మెల్యే

సీఎం సహాయ నిధి పేదలకు వరం: ఎమ్మెల్యే

ఎల్బీనగర్, అక్షిత ప్రతినిధి:

సీఎం సహాయనిది పేదలకు వరము లాంటిదని అర్హులు ఉపయోగించుకోవాలని ఎమ్మార్డీసి చైర్మన్ , ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. బాధిత చిన్నారి తండ్రి కాసోజు.బ్రహ్మచారి 2,25,000 రూపాయల చెక్కును బుధవారం క్యాంపు కార్యాలయంలో ఆందజేస్తున్న ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుదీర్ రెడ్డి. హస్తినపురం డివిజన్ పరిధిలోని భారతినగర్ కు చెందిన చిన్నారి దేవర్ష్(7 సంవత్సరాలు).పతినిత్యం జ్వరంతో బాధపడుతున్న నేపథ్యంలో హాస్పిటల్ నందు చేరిక కావడం జరిగింది..చికిత్స అనంతరం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కావడం జరిగింది. అయితే వారి యొక్క ఆర్థిక స్థితులు బాగలేక వారు వారి యొక్క కుటుంబసభ్యులు ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుదీర్ రెడ్డి సంప్రదించారు. వెంటనే స్పందించిన సుదీర్ రెడ్డి అట్టి ఆపరేషన్ కు అయిన డబ్బుల వివరాలను ముఖ్యమంత్రి సహాయనిదికి దరఖాస్తు చేయడం జరిగింది. దానికి గాను వారికి 2,25,000(రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు)చెక్కు మంజూరు కావడం జరిగింది.ఈ సందర్భంగా సుదీర్ రెడ్డి మాట్లాడుతూ. పేదల ఆరోగ్య పరిరక్షణకు సీ.యం.సహాయనిధి దోహదపడుతుంది అని అన్నారు.ఈ పథకం పేదలకు ఓ వరం లాంటిది అని అన్నారు.పేద ప్రజలకు నాణ్యమైన అధునాతన వైద్య సేవలను పొందేందుకు సీ.ఎం.సహాయనిది అండగా ఉంటుంది అని అన్నారు. ఎల్.బి.నగర్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం పనిచేస్తాను అని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో హస్తినపురం డివిజన్ కార్పొరేటర్ సుజాత నాయక్, డివిజన్ బారాస అధ్యక్షులు సత్యంచారి, శివారెడ్డి, భాస్కర్ సాగర్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking