ఘనంగా పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు

ఘనంగా పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు

చౌటుప్పల్, అక్షిత ప్రతినిధి:

చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని గ్రీన్ గ్రో పాఠశాలలో ఈ విద్యా సంవత్సరము పదవ తరగతి పూర్తిచేసుకొని ఇంటికి వెళుతున్న పదవ తరగతి విద్యార్థులకు 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు వీడ్కోలు సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. పదవ తరగతి విద్యార్థులు పూర్తిచేసుకుని వెళుతున్న తమ తోటి విద్యార్థులతో గత స్మృతులను నెమరు వేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు .పాఠశాల చైర్మన్ బండి వీణ అనిల్ కుమార్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులంతా మంచి ప్రవర్తనతో ఎదిగి ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులకు, గురువులకు, పాఠశాలకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి జూనియర్ విద్యార్థులకు స్ఫూర్తిగా నిలవాలని కోరారు. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా మంచి భవిష్యత్తును ఏర్పరచుకునే విధంగా ఇంటర్ లో మంచి గ్రూపును సెలెక్ట్ చేసుకోవాలని విద్యార్థులకు తెలిపారు.

అనంతరం విద్యార్థులు గత పది సంవత్సరాలుగా పాఠశాలతో ఉన్న అనుభవాలను తోటి విద్యార్థులతో గుర్తు చేసుకున్నారు. ముగింపులో విద్యార్థులు పాడిన పాటలు చేసిన నృత్యాలు వేదికపై సందడి చేశాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల డీన్ సతీష్ రెడ్డి ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking