గ్రంథాలయంలో ఘనంగా కవిసమ్మేళనం

గ్రంథాలయంలో ఘనంగా కవిసమ్మేళనం

భద్రాద్రి కొత్తగూడెం అక్షిత ప్రతినిధి:

డా.బి.ఆర్ అంబేద్కర్ 132 వ జయంతి వేడుకలలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్ర గ్రంధాలయం ఆధ్వర్యంలో అంబేద్కర్‌ ఇతివృత్తంగా కవి సమ్మేళనం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ దిండిగల రాజేందర్‌ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ప్రముఖ కవి ఎం ఆర్ జి కె మూర్తి పాల్గొన్నారు.

గ్రంథాలయ డైరెక్టర్లు భాస్కర్ రావు, అక్కిరాజు గణేష్, వరలక్ష్మీదేవి, జి.మణిమృదుల, నవీన్ ఆఫీస్ ఇంచార్జ్ శాఖ గ్రంథ పాలకులు మధుబాబు గ్రంథాలయ సిబ్బంది, ప్రముఖ కవులు హాజరై కార్యక్రమం జయప్రదం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ కవయిత్రి రచయిత్రి రేడియో వ్యాఖ్యాత ఉపాధ్యాయిని తురుమెళ్ళ కళ్యాణి అను సంధాన కర్తగా వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కవి సమ్మేళనం అనంతరం కవితా గానంతో అలరించిన కవివరేణ్యులైన బుచ్చయ్య చిట్టి మధు కృష్ణ రాజేష్ కళ్యాణి పద్మ లను చిన్నారి తేజస్వినిని ఛైర్మన్ అతిథులు సత్కరించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking