జల్ పల్లి మున్సిపాలిటీ సమస్యలపై త్వరలో కార్యచరణ *డ్రైనేజీ, రోడ్ల సమస్యలను వారంలో తీర్చాలి- అందెల శ్రీరాములు డిమాండ్. *కేంద్రం నిధులు ఇస్తున్నా ప్రధాని మోడీ ఫోటో ఎందుకు పెట్టలేదని ప్రశ్నా.

జల్ పల్లి మున్సిపాలిటీ సమస్యలపై త్వరలో కార్యచరణ
*డ్రైనేజీ, రోడ్ల సమస్యలను వారంలో తీర్చాలి- అందెల శ్రీరాములు డిమాండ్.
*కేంద్రం నిధులు ఇస్తున్నా ప్రధాని మోడీ ఫోటో ఎందుకు పెట్టలేదని ప్రశ్నా.
జల్ పల్లి అక్షిత ప్రతినిధి:
*జల్ పల్లి మున్సిపాలిటీలో ఎంఐఎం- సబితమ్మ రాజ్యాంగం నడుస్తోందని భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు అందేల శ్రీరాములు ఆరోపించారు.జల్ పల్లి మున్సిపల్ పరిధిలో ప్రాంతాలకు విభేదం లేకుండా అన్ని ప్రాంతాల అభివృద్ధికి సమాన రాజన్న ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. *కేంద్రం నిధులు ఇస్తున్నా ప్రధాని మోడీ ఫోటో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.
జల్ పల్లి మున్సిపాలిటీ సమస్యలపై త్వరలో పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి అందెల శ్రీరాములు యాదవ్.బుధవారం జల్ పల్లి మున్సిపాలిటీ కమిషనర్ వసంతను కలిసి డ్రైనేజీ, రోడ్లు, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇచ్చారు.
స్థానిక బీజేపీ కౌన్సెలర్లు బుడమల యాదగిరి, ప్రశాంతి శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో కమిషనర్ ను కలిశారు. ఈ సందర్భంగా అందెల శ్రీరాములు మాట్లాడుతూ… జల్ పల్లి మున్సిపాలిటీలో ఓటుబ్యాంకు రాజకీయాలు తప్పా… మంత్రి సబితమ్మ ఏమాత్రం అభివృద్ధి చేయలేదని విమర్శించారు. వారం రోజుల్లోగా డ్రైనేజీ, రోడ్ల సమస్యలను తీర్చాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీకి కేంద్రం నిధులు ఇస్తున్నా… ప్రధాని నరేంద్రమోడీ ఫోటో ఎందుకు పెట్టలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు శ్రీరాములు యాదవ్.
జల్ పల్లి మున్సిపాలిటీలో మంత్రి సబితా, ఎంఐఎం రాజ్యాంగం నడుస్తుందని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు శాంత కుమార్, గొరిగె మల్లేశ్, బీజేవైఎం అధ్యక్షుడు దిలీప్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, మురళి, హరికృష్ణ, నర్సింగ్ రావు, శ్రీకాంత్, ఖాజాపాష, రాము, వెంకటేశ్, నర్సింహా, రామారావు, శాంతమ్మ, సీనియర్ నాయకులు మర్రి అంజిరెడ్డి, నిమ్మల రవికాంత్ గౌడ్, మంత్రి మహేష్ ముదిరాజ్, రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి సహా బీజేపీ, బీజేవైఎం నాయకులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking