పండించిన ప్రతి గింజ కొంటాం
ఎమ్మెల్యే భాస్కర్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మిర్యాలగూడ మండలం అవంతీపురంలోని మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ యార్డులో మిర్యాలగూడ, ఆలగడప ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్రావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తమ ధాన్యాన్ని ఆరబెట్టి నాణ్యమైనవి తీసుకువచ్చి మద్దతు ధర పొందాలన్నారు. కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.


కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, నల్లగొండ జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ నూకల సరళ హనుమంత్‌రెడ్డి, డిసిసిబి డైరెక్టర్ బంటు శ్రీనివాస్, పిఎసిఎస్ చైర్మన్ వేలిశెట్టి రామకృష్ణ, మిర్యాలగూడ మండల రైతు బంధుసమితి అధ్యక్షులు గడగోజు ఏడుకొండలు, మండల పార్టీ అద్యక్షులు మట్టపల్లి సైదులు యాదవ్, మాజీ ఎంపీపీ ఒగ్గు జానయ్య, వ్యవసాయశాఖ అసిస్టెంట్ పి.నాగమణి, మండల వ్యవసాయ అధికారి కళ్యాణ చక్రవర్తి, మార్కెట్ కార్యదర్శి శ్రీధర్, పోలగాని శ్రీనివాస్, సేవా నాయక్, చిరుమామిళ్ళ వేణుగోపాల్ రావు పాల్గొన్నారు.