సైనిక్ స్కూల్ లో సీటు సాధించిన ఆదర్శ విద్యార్థి నిహాన్
అక్షిత న్యూస్ జయశంకర్ భూపాలపల్లి (కాటారం) : మండల కేంద్రంలోని ఆదర్శ హైస్కూల్ లో 5వ తరగతి చదువుతున్న గారెపల్లి గ్రామానికి చెందిన ఈర్నాల నిహన్ సైనిక్ స్కూల్ లో సీటు సాధించాడు… ఇటీవల జరిగిన ఎంపిక పోటీల్లో అత్యంత ప్రతిభ కనబరిచి కరీంనగర్ లోని రుక్మపూర్ సైనిక్ స్కూల్ (CBSE) లో 6వ తరగతి లో సీటు సాధించాడు.. విద్యార్ధి నిహన్, అతడి తల్లిదండ్రులు సంధ్య – సుమన్ దంపతులను పాఠశాల చైర్మన్ జనగామ కరుణాకర్ రావు, కరస్పాండెంట్ జనగామ కార్తీక్ రావు, ప్రిన్సిపాల్ కృషిత, ఉపాధ్యాయులు, పలువురు అభినందనలు తెలిపారు.