దళితుల సంక్షేమానికి కృషి చేస్తా..యుగంధర్ రెడ్డి.
కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి:
తెలంగాణ దళిత సంక్షేమ సంఘం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో రాజు కాలనీ కమాన్ దగ్గర డా.బి.ఆర్.అంబేద్కర్132వ జయంతిని పురస్కరించుకుని నూతన కాంస్య విగ్రహా ఆవిష్కరణలో వారి ఆహ్వానం మేరకు పాల్గొన్న కూకట్ పల్లి ఏ.బ్లాక్ ఉపాధ్యక్షుడు మాదిరెడ్డి యుగంధర్ రెడ్డి. ఈ సందర్భంగా నియోజకవర్గ దళిత సంక్షేమ నిధికి తన వంతుగా 50/- వేల రూపాయలు దళిత సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆధిముళ్ల రాము,చీఫ్ అడ్వైసర్ విల్సన్ సమక్షంలో అందజేయడం జరిగింది.
సభను ఉద్దేశించి మాట్లాడుతూ తాను దళితుల అభివృద్ధికి పాటు పడతానాని,వారి సమస్యలపై కాంగ్రెస్ పార్టీ తరపున అండగా ఉంటానని వారికి ఎల్లవేళలా తోడ్పాటును అందిస్తానని చెప్పారు.ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షుడు పోలీస్ శ్రీను,జెర్రిపోతుల రవీందర్,ఎడ్ల ప్రభాకర్,ఎస్.కె శ్రీనివాస్, సుంకేసరోజగారు,దీప్తి,రామన్, శంకర్, మధు మోహన్,ఆకుల నరేందర్,ప్రసన్న,ఎడ్ల సతీష్,గజానంద్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.