అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేస్తా.వడ్డేపల్లి
కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి:
బాబా సాహెబ్ విగ్రహావిష్కరణలో పాల్గొన్న వడేపల్లీ రాజేశ్వర్ రావు.
కూకట్ పల్లి తెలంగాణ దళిత సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆదిమూల రాము ఆధ్వర్యంలో బుధవారం బాల నగర్ రాజు కాలనీలో బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 12 అడుగుల విగ్రహవిష్కరణ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. అనంతరం వడ్డేపల్లి మాట్లాడుతూ బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ చేసిన సేవలను భారత జాతి మొత్తం స్మరించుకోవాలని గుర్తుచేశారు. బాబా సాహెబ్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ దళిత సంక్షేమ సంఘం సభ్యులు, బాలనగర్ డివిజన్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.