కుటుంబ సమేతంగా ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి
బిఆర్ఎస్ పార్టీ నాయకులు డాక్టర్ అనంతారపు బ్రహ్మం
కోదాడ టౌన్ అక్షిత న్యూస్:
కోదాడ పట్టణంలో ఈ నెల 16న జరిగే బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్థానిక 13 వ వార్డు టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ డాక్టర్ అనంతరపు బ్రహ్మం గోవిందమ్మ ఆధ్వర్యంలో ఇంటింటికి బొట్టు పెట్టి ఆహ్వానించే కార్యక్రమం నిర్వహించారు ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా డాక్టర్ ప్రమీల శ్రీపతి రెడ్డి పాల్గొని ప్రారంభించారు వీరు మాట్లాడుతూ 16న జరిగే ఆత్మీయ సమ్మేళనానికి కుటుంబ సమేతంగా వార్డు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ వార్డు అధ్యక్షులు మట్టా నర్సింహారెడ్డి ప్రధాన కార్యదర్శి ఎస్కే రహీం,ఈదుల కృష్ణయ్య, పాస్టర్ యేసయ్య ,తిరుమలగిరి రాధాకృష్ణ ,వెంపటి మనోహర్ ,కాటంరెడ్డి ప్రసాద్ రెడ్డి, పెంట విజయలక్ష్మి ,శాంత ,దొడ్డ లక్ష్మి, బండారుపల్లి వెంకటేశ్వరరావు, పాలూరి తిరుపతిచారి ,అనంతారపు సత్యనారాయణ ,తుంకోజు నరసింహ చారి, ఆవుల వెంకటేశ్వర్లు ఇతరులు పాల్గొన్నారు