రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు. తమ్మర లో ధాన్యం కొనుగోలు కేంద్రంప్రారంభం కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ .

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు.

తమ్మర లో ధాన్యం కొనుగోలు కేంద్రంప్రారంభం

కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ .

కోదాడ టౌన్ ,అక్షిత న్యూస్:

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని కోదాడ అభివృద్ధి ప్రధాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. బుధవారం కోదాడ పరిధిలోని  తమ్మరలో  దాన్యం కొనుగోలు కేంద్రమును ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో తెలంగాణ రాష్ట్రం మినహా ఏ రాష్ట్రంలో కూడా రైతులు పండించిన పంటను పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడం లేదని రైతుల కష్టసుఖాలు తెలిసిన వ్యక్తిగా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులు పండించిన పంటను గిట్టుబాటు ధరలకు. కొనుగోలు చేసి రైతు బాంధవుడిగా నిలిచారన్నారు దళారులను నమ్మి మోసపోకుండా రైతులందరూ ప్రభుత్వం సూచించిన నాణ్యతా ప్రమాణాలు పాటించి కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో  పిఎసిఎస్ చైర్మన్ ఆవుల రామారావు, వైస్ చైర్మన్ బుడిగం నరేష్,స్థానిక  కౌన్సిలర్ సామినేని నరేష్, స్థానిక డైరెక్టర్ కమతం వెంకటయ్య, ఓరుగంటి శ్రీనివాస రెడ్డి, గుండపునేని ప్రభాకర్ రావు చంద్రమౌళి,  దేవాలయ చైర్మన్ కనగాల శ్రీధర్, సామినేని వెంకటేశ్వరరావు, బొల్లు ప్రసాద్, కమతం రాజేశ్వరరావు, కృష్ణయ్య,పోచం పూర్ణయ్య ,హరిబాబు, ఏ ఈ ఓ చాంద్ బీ, సీఈవో మంద వెంకటేశ్వర్లు గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking