కంటి వెలుగు కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీపీ కర్ణాకర్
చేర్యాల,ఏప్రిల్ 12 అక్షిత ప్రతినిధి: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం చేర్యాల మండలంలోని కడవేరుగు గ్రామంలో మండల ఎంపీపీ ఉల్లం పల్లి కర్ణాకర్ ఆధ్వర్యంలో రెండవ విడత కంటి వెలుగు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కంటి సమస్యతో బాధపడొద్దని అందత్వ రహిత తెలంగాణను సాధించాలని సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారని, కావున గ్రామ ప్రజలు వచ్చేనెల 3వ తేదీ వరకు కంటి వెలుగు కేంద్రాన్ని సద్వినియోగపరచుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొమ్ముల స్వప్న,బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు అనంతల మల్లేశం,పిఏసిఎస్ వైస్ చైర్మన్ తాళ్లపల్లి నరసయ్య,చేర్యాల మండల కో ఆప్షన్ సభ్యులు నాజర్, వార్డు సభ్యులు రమేష్, నరేష్, గ్రామ శాఖ అధ్యక్షులు సిద్ధులు, యూత్ అధ్యక్షుడు అనిల్, వైద్యాధికారులు మరియు ఏఎన్ఎం రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.