బి ఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు. ఆదిలాబాద్, అక్షిత బ్యూరో:

బి ఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు.

ఆదిలాబాద్, అక్షిత బ్యూరో:

ఎంచుకొనిప్రజలను మోసం చేసి వారిని పక్కదోవ పట్టించడంలో బీజేపీ నేతలు . పి ఎచ్ డి లు చేశారని, అయినప్పటికీ వారి బూటకాలు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఆదిలాబాద్
ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన పార్టీ చేరికల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక జై జవాన్ నగర్ కు చెందిన నలభై మంది యువకులు బీజేపీ పార్టీని వీడి బీ.ఆర్.ఎస్ లో చేరగా.. వారికి గులాబి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ మేరకు ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ… దేశ సంపదను కొల్లగొట్టిన వ్యక్తులకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మద్దతు ఇస్తోందని, సంపదను విదేశాలకు దోచుకేల్లిన వారి 19 లక్షల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేయడం అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. కార్పోరేట్లకు అనుకూలమైన విధానాలను అమలు చేస్తూ ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశారని మండిపడ్డారు. దేవుడి పేరు మీద రాజకీయాలు చేస్తూ బీజేపీ నాయకులూ పబ్బం గడుపుకుంటున్నారని పేర్కొన్నారు. బీజేపీ అనుసరిస్తున్న విధానాలు నచ్చక అనేక మంది యువకులు స్వచ్చందంగా బీ.ఆర్.ఎస్ పార్టీలో చేరి తమ మద్దతు తెలుపుతున్నరన్న ఎమ్మెల్యే…. స్థానిక బీజేపీ నేతలపై సైతం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.కార్యక్రమంలో బీ.ఆర్.ఎస్ పట్టణ అధ్యక్షులు అలాల్ అజయ్, కో ఆప్షన్ సభ్యులు సంజీయ్.నాయకులు గోలి శంకర్, అబ్దుల్ అతీక్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking