ఏజెన్సీ ప్రాంత ప్రజల అభివృద్ధి,సంక్షేమమే పోలీసుల లక్ష్యం : జిల్లా ఎస్పీ కె.సురేష్ కుమార్ ఐపీఎస్

ఏజెన్సీ ప్రాంత ప్రజల అభివృద్ధి,సంక్షేమమే పోలీసుల లక్ష్యం : జిల్లా ఎస్పీ కె.సురేష్ కుమార్ ఐపీఎస్

ఆదిలాబాద్, అక్షిత బ్యూరో:

కాగజ్ నగర్ రూరల్ మండలంలోని మాలిని గ్రామ పంచాయతీ పరిధి లోని మాణిక్ పటార్ ప్రాంతాన్ని సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా ఎస్పీ కే.సురేశ్ కుమార్ ఐపీఎస్

పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా బియ్యం, నిత్యావసర సరుకులు , మహిళలకు చీరలు మరియు యువత కు వాలీబాల్ కిట్ పంపిణీ చేసిన ఎస్పీ

జిల్లా లో అత్యంత మారుమూల ప్రాంతమైన మాణిక్ పాటర్ లో పర్యటన. సుమారు 8 కి.మీ లు ద్విచక్రవాహనంపై ప్రయాణం (చిన్న మాలిని గ్రామం నుండి మాణిక్ పాటర్
అసాంఘిక శక్తులకు సహకరించవద్దు- జిల్లా ఎస్పీ కె. సురేష్ కుమార్ ఐపీఎస్
యువత మరియు ప్రజలు అప్రమత్తం గా ఉంటూ, అపరిచిత వ్యక్తుల సమాచారం పోలీసులకు అందించాలి
కొమురం భీం
ఆసిఫాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత ప్రజల అభివృద్ధి,సంక్షేమమే జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యం అని ఎస్పీ కె.సురేష్ కుమార్ ఐపీఎస్ అన్నారు.
బుధవారం కాగజ్ నగర్ రూరల్ మండలంలోని మాలిని గ్రామ పంచాయతీ పరిధి లోని మాణిక్ పటార్ ప్రాంతాన్ని సందర్శించి వారి సమస్యలను ఎస్పీ కే సురేష్ కుమార్ ఐపిఎస్ అడిగి తెలుసుకున్నారు. పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా బియ్యం మరియు నిత్యావసర సరుకులు, మహిళలకు చీరలు, యువత కు వాలీబాల్ కిట్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…

యువత మరియు ప్రజలు మావోయిస్ట్ ల ప్రలోభాలకు లోనూ కావద్దని, వారికి సహకరించవద్దని పేర్కొన్నారు.
అపరిచిత వ్యక్తుల మాయమాటలు నమ్మవద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,
పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండి,సహకరిస్తారని తెలియజేశారు.
ప్రజలకు ఏ సమస్యలు ఉన్న ప్రభుత్వం, పోలీసుల ద్వారా
పరిష్కరించుకోవాలనీ, పేర్కొన్నారు.
యువత మావోయిస్ట్ లకు ఆకర్షితులు కావద్దని, ఉన్నత చదువులు చదవాలని, ప్రభుత్వం జిల్లాలో ఉచిత విద్య , ఉచిత హాస్టల్ సదుపాయం కల్పించిందని,వాటిని ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. విద్య తోనే అభివృద్ది సాధ్యం అని, పిల్లలు , యువత ను వారి తల్లితండ్రులు చదివించాలి అని తెలిపారు. గ్రామం లో నిషేధిత గంజాయి సాగు ను పండించవద్దని అన్నారు.
గ్రామస్థులు ఎస్పీ కి పలు సమస్యలు విన్నవించారు, ఎస్పీ మాట్లాడుతూ, పోలీసులు మీకోసం కార్యక్రమం ద్వారా జిల్లాలో, గిరిజన ప్రాంతాల్లో ఎన్నో సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, మీ ప్రాంత సమస్యలు జిల్లా పాలనాదికారితో చర్చించి, పరస్పర సహకారం తో సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేశారు.
కమ్యూనిటీ పోలీసింగ్ వల్ల ప్రతి మారుమూల ప్రాంతాల్లో పోలిసులు అందుబాటులో ఉంటున్నారని, అపరిచిత వ్యక్తుల సమాచారం తెలిస్తే పోలీస్ స్టేషన్ లో తెలియజేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ అచ్చేశ్వర రావు, కాగజ్ నగర్ డి.ఎస్.పి కరుణాకర్, కాగజ్ నగర్ రూరల్ సిఐ నాగరాజు, కౌటాల సిఐ సాదిక్ పాషా, కాగజ్ నగర్ రూరల్ ఎస్.ఐ సోనియా మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking