అంబేద్కర్ జయంతి వేడుకలు జయప్రదం చేయండి – బిఎస్పి

అంబేద్కర్ జయంతి వేడుకలు జయప్రదం చేయండి

– బిఎస్పి

నకిరేకల్ అక్షిత ప్రతినిధి:

అంబేద్కర్ జయంతి వేడుకలను జయప్రదం చేయాలని చిట్యాల మండల కమిటీ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించారు.అనంతరం వారు మాట్లాడుతూ అంటరానితనంపై ఎక్కుపెట్టిన ఆయుధం.. దురహంకారంపై గొంతెత్తిన స్వరం.. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్. ఈ రోజు ఆయన 131వ జయంతి. 1891లో ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అంబవాడేలో తల్లిదండ్రులు.. రాంజీ మలోజీ సాక్వాల్, భీమాబాయ్‌లకు జన్మించారు. పూర్తి పేరు భీమ్ రావ్ రాంజీ అంబేద్కర్. చదువుకోవాలన్నా.. మంచినీళ్ళు తాగాలన్నాకులమే అడ్డుగా నిలబడింది.ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు అన్నారు . సమాజంలో వర్ణ, వర్గభేదాలు ఉండొద్దని రాజ్యాంగాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. ఎందరికో ఆరాధ్యుడయ్యారు.డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కొందరివాడు కాదు.. అందరివాడు, రాజ్యాంగాన్ని రచించి ప్రజలకు కావాల్సిన అవసరాలను, హక్కులను తెలిపిన గొప్ప మహా నాయకుడు అని అన్నారు.ప్రజలకు రిజర్వేషన్లు, హక్కులు కల్పించిన గొప్ప నాయకుడు అంబేద్కర్. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎవరెవరికీ ఎంత రిజర్వేషన్ల ప్రకారం వేతనాలు తీసుకోవాలో, సమాజంలో ఎలా నడుచుకోవాలో, రాజ్యాంగంలో క్లుప్తంగా రచించి ప్రజలకు అందించిన గొప్ప మహనీయుడు. అంబేద్కర్‌ విభిన్న అంశాలపై ఎంతో విస్తృతంగా రచనలు చేశారు. ప్రజాస్వామ్యం, అంటరానితనం, కుల నిర్మూలన, మతమార్పిడి, బౌద్ధమతం, హిందూమతంలోని చిక్కుముడులు, ఆర్థిక సంస్కరణలు-దళితులు, భారతదేశ చరిత్ర, మొదలైన వాటిపై ఆయన రచనలు ఎంతో ప్రఖ్యాతి చెందాయి. అంబేడ్కర్ భారతీయ సామాజిక వ్యవస్థను మార్చడం కోసం జీవితాంతం కృషి చేశారు. కులవ్య వస్థను రద్దు చేయడానికి కులనిర్మూలనను ప్రతిపాదించారు. కులం ఒక పెట్టుబడిగా, అదనపు సంపదగా, అదనపు విలువగా, అధికార కేంద్రంగా ఉందని స్పష్టం చేయడం ద్వారా అంబేడ్కర్ కులాన్ని కూడా అర్థశాస్త్రంలో భాగంగా చర్చించారు. తెలుగునాట మొదటిసారిగా అంబేడ్కర్‌ను సాహిత్యంలో ప్రస్తావించిన ఘనత మహాకవి గుర్రం జాషువాకే దక్కుతుంది. 1947లో వెలువరించిన ఆయన కావ్యం గబ్బిలంలో ‘జంబేడ్కరుండు సహోదరుండు’ అనే పద్యంలో గబ్బిలాన్ని అంబేడ్కర్ దీవెనలు అందుకోమంటారు. అప్పటి నుండి తెలుగు సాహిత్యంలో అంబేడ్కర్ శాశ్వత స్థానం సంపాదించుకున్నారని అన్నారు.చిట్యాల మండలంలో జరిగే అంబేద్కర్ జయంతి వేడుకలను జయప్రదం చేయాలనీ కోరారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మేడి రాజు, మండల నాయకులు గ్యార శేఖర్, బాకీ శంకర్ ప్రసాద్, మేడి కార్తీక్, వినయ్, మల్లేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking