కాంట్రాక్టు కార్మికులకు శ్రమకు తగ్గ వేతనం, ఈపీఎఫ్, ఈఎస్ఐ చెల్లించాలని విచారణ జరిపిన తర్వాత లేబర్ కమిషనర్ ఆదేశాల జారీ . – కార్మికుల సమస్యలను పరిష్కరించాలని లిఖితపూర్వక హామీ – సామాజిక కార్యకర్త కర్నే రవి – కార్మికులు అధైర్య పడవద్దు అందుబాటులో ఉంటాను

కాంట్రాక్టు కార్మికులకు శ్రమకు తగ్గ వేతనం, ఈపీఎఫ్, ఈఎస్ఐ చెల్లించాలని విచారణ జరిపిన తర్వాత లేబర్ కమిషనర్ ఆదేశాల జారీ .

– కార్మికుల సమస్యలను పరిష్కరించాలని లిఖితపూర్వక హామీ

– సామాజిక కార్యకర్త కర్నే రవి
– కార్మికులు అధైర్య పడవద్దు అందుబాటులో ఉంటాను

పినపాక అక్షిత ప్రతినిధి:

కాంట్రాక్టు కార్మికుల శ్రమ దోపిడీని కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారు. వారికి సదుపాయాలు కల్పించకుండ, వారికి శ్రమకు తగ్గ వేతనం చెల్లించకుండ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీనిపై సామాజిక కార్యకర్త కర్నే రవి మార్చి 15వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని మణుగూరు మున్సిపాలిటీలో పని చేస్తున్న కాంట్రాక్టర్ కోటేశ్వరరావుపై మణుగూరు ఏ ఎల్ ఓ లేబర్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. కాంట్రాక్టు కార్మికులకు ఐడి కార్డు లేవని, ఈఎస్ఐ, పిఎఫ్ చెల్లింపులు చేయడం లేదని, కార్మికుల శ్రమకు తగ్గ వేతనం అందడం లేదని దీనిపై విచారణ చేయాలని మున్సిపల్ అధికారులపై, కాంట్రాక్టర్ కోటేశ్వరరావుపై ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు.ఈ రోజు జాయింట్ కమిటీ విచారణ చేపట్టిన లేబర్ అధికారులు కాంట్రాక్టు కార్మికులకు ఐడి కార్డులు లేవని విచారణ లో తెలిసింది వారు వెంటనే ఐడి కార్డులు మంజూరు చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని, శ్రమకు తగ్గ వేతనం లేబర్ యాక్ట్ ప్రకారం చెల్లించాలని మున్సిపల్ అధికారుల నుండి కాంట్రాక్టర్ కోటేశ్వరరావు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడం జరిగిందని సామాజిక కార్యకర్త కర్నే రవి తెలియజేశారు. కాంట్రాక్టు కార్మికులు అధైర్య పడవద్దని ఎల్లవేళలా తమకు అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త కర్నే రవి తెలియజేశారు. ఈ యొక్క విచారణలో లేబర్ అధికారులు, మున్సిపల్ అధికారులు, కాంట్రాక్టర్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking