ఈపి ఆపరేటర్ల సమస్యలు పరిష్కరించండి జిఎం దుర్గం రామచందర్ కి వినతి పత్రం అందజేసిన ఆపరేటర్లు
పినపాక అక్షిత ప్రతినిధి:
సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలో ఏపీ ఆపరేటర్లకు సంబంధించి ప్రమోషన్లు సీ గ్రేడ్ ,బి గ్రేడ్ ఖాళీలు భర్తీ చేయాలని కొత్తగూడెం రీజియన్ స్థాయిలో గత రెండు నెలల క్రితం నిర్వహించిన ఏ గ్రేడ్, స్పెషల్ గ్రేట్ ఆపరేటర్లకు పదోన్నతుల లేఖలు సత్వరమే అందజేయాలని కోరుతూ ఏరియా ఈపి ఆపరేటర్లు బుధవారం ఉదయం ఓ సీ-2 సందర్శనకు విచ్చేసినటువంటి జిఎం దుర్గం రామచందర్ కి ప్రాజెక్ట్ అధికారి తాళ్లపల్లి లక్ష్మీపతి గౌడ్, ప్రాజెక్ట్ మేనేజర్ మాలోతు రాముడు, నాయకులు వి ప్రభాకర్ రావు సమక్షంలో ఆపరేటర్ల సంతకాల సేకరణ తో కూడిన వినతి పత్రాన్ని జిఎం కి అందజేశారు జిఎం సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారానికి తగు చర్యలు చేపడుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆపరేటర్లు ఎస్ డి నా సర్ పాషా, సిహెచ్ అశోక్, ఎస్ కుమారస్వామి, జాన్ అబ్రహం, జగదీష్ ,శ్రీధర్, రవి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.