బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలి

బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలి

మంచిర్యాల, అక్షిత బ్యూరో:

సిఆర్ బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం వెంటనే 1.91 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని వైఏస్సార్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాశీ సతీష్ కుమార్ డిమాండ్ చేశారు. ఈమేరకు వైఏస్సార్ టిపి ఆద్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వెంటనే టిఎస్పిఎస్సి బోర్డును ప్రక్షాళన చేసి, పరీక్ష పత్రాలు బయటికి రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, పేపర్ లీకేజీ వ్యవహారాన్ని సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జి చే విచారణ జరిపించాలని, అదేవిధంగా ప్రశ్నా పత్రాల లీకేజీ కుంభకోణంలో దోషులను కఠినంగా శిక్షించి, పరీక్షలు తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు నెలకు 3016రూపాయల నిరుద్యోగ భృతి చెల్లించాలని, ఉద్యోగాలు రాని నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్నారు. బిసి, ఎస్సి, ఎస్టీ లకు కార్పొరేషన్ల ద్వారా అర్హులకు రుణాలు మంజూరు చేయాలని కోరారు. విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని, పేద విద్యార్థులకు భారం పడకుండా పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని డిమాండ్ చేశారు.

విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్ లు విడుదల చేయాలని, యూనివర్సిటీలకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, యూనివర్సిటీ, కళాశాలలో, పాఠశాలలో ఖాళీలను వెంటనే భర్తీ చేసి, అన్ని రకాల విద్యాలయాలలో యుద్ధ ప్రాతిపదికన మౌలిక సదుపాయాలు కల్పించాలని, హాస్టల్ విద్యార్థులకు న్యాయమైన భోజనం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఏస్సార్ టిపి చెన్నూరు నియోజకవర్గ కో ఆర్డినేటర్ దుర్గం నగేష్, మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు కల్పన జాగటి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ముల్కల రాజేంద్రప్రసాద్, బిసి సెల్ జిల్లా అధ్యక్షుడు పెద్దూరి శ్రీనివాస్, ప్రచార కమిటీ జిల్లా అధ్యక్షురాలు శ్రీలత, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు గాదె సాయి, ప్రధాన కార్యదర్శి గర్రెపల్లి మనోజ్ కుమార్, జైపూర్ మండల అధ్యక్షుడు సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking