నిబంధనలు పాటించని శ్రీ చైతన్య పాఠశాల వాహనాలను సీజ్ చేయాలి
మందమర్రి, అక్షిత ప్రతినిధి :
మందమర్రి మండల కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాల వాహనాలు రవాణా శాఖ నిబంధనలు పాటించడం లేదని వెంటనే వాటిపై చర్యలు తీసుకోని సీజ్ చేయాలని విద్యార్థి జన సమితి జిల్లా అధ్యక్షుడు బచ్చలి ప్రవీణ్ కుమార్ బుధవారం ప్రకటనలో డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీ చైతన్య పాఠశాల వాహనాలు రవాణా శాఖ నిబంధనలు పాటించకుండా మితిమీరిన వేగంతో అధిక సంఖ్యలో పిల్లల రవాణా చేస్తున్నారని, దీంతో తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అదేవిధంగా అనుమతులు లేని వాహనాలను విద్యార్థుల రవాణాకు ఉపయోగిస్తూ పిల్లల భద్రతను పట్టించుకోవడంలేదని, రవాణా శాఖ అధికారులు స్పందించి, పాఠశాల వాహనాలపై చర్యలు తీసుకొని, సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.