సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు
చేర్యాల,ఏప్రిల్ 12 అక్షిత ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్ పంచాయతీ కార్యదర్శుల 4 సంవత్సరాల ప్రోబిషన్ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా,క్రమబద్ధీకరణ(రెగ్యులర్) చేయుటకై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కి ధన్యవాదాలు తెలుపుతూ,బుధవారం చేర్యాల మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఆత్మీయ సమ్మేళన సమావేశాన్ని నిర్వహించడం జరిగింది.ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల ఎంపీపీ ఉల్లంపల్లి కర్ణాకర్ మరియు వైస్ ఎంపీపీ తాండ్ర నవీన్ రెడ్డి,మండల పంచాయతీ అధికారి హాజరైనారు.అనంతరం ఎంపీపీ కర్ణాకర్ అధ్యక్షతన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సేవలను గుర్తించి వారిని ఘనంగా సన్మానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల మండల అధ్యక్షులు ఏలూరి రాజు, మండల కార్యదర్శి మలుగ సతీష్, మహిళ అధ్యక్షురాలు పల్లె రజిత, కోశాధికారి బత్తుల సురేష్ మరియు కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.