సీలేరు ప్రాంతం నుండి అక్రమంగా గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్న నలుగురు నిందితులను కూకట్ పల్లి పోలీసులు అరెస్టు చేశారు.
సీలేరు ప్రాంతం నుండి అక్రమంగా గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్న నలుగురు నిందితులను కూకట్ పల్లి పోలీసులు అరెస్టు చేశారు.
కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి:
గంజాయి సేవించే వారిని లక్ష్యంగా చేసుకొని గంజాయి విక్రయించేందుకు సీలేరు ప్రాంతం నుండి అక్రమంగా గంజాయి తీసుకొని వచ్చిన నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు కూకట్ పల్లి పోలీసులు.గోదావరిఖని ప్రాంతానికి చెందిన మేకల అభిలాష్(22) ,చల్లా దను(27) నిమ్మల మణికంఠ (21)తో పాటు మంథనికి చెందిన లింగం శ్రీపాదును(21) అదుపులోకి తీసుకున్నట్లు కూకట్ పల్లి ఏసిపి చంద్రశేఖర్ వెల్లడించారు.

నిందితుల వద్ద నుండి 5.3 కేజీల ఎండు గంజాయితో పాటు కారు, మూడు మొబైల్స్ సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.ఏ1 నిందితుడిగా ఉన్న మేకల అభిలాష పైన పీడీ యాక్టు సైతం నమోదు చేస్తామని తెలిపారు.కూకట్ పల్లి వై జంక్షన్ వద్ద వాహనాల తనిఖీల్లో భాగంగా కారు డిక్కీ భాగంలో గంజాయి తీసుకొని వెళ్తుండగా నిందితులను అరెస్టు చేశామని ఏసిపి తెలిపారు,
నిందితుల పైన కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామని తెలియజేశారు.