ప్రతి పంచాయతీలో ఫిష్ పాండ్ల ఏర్పాటుకు అంచనాలు సిద్ధం చేయాలి
ఎంపిడిఓ జ్యోతిలక్ష్మి
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
ప్రతి గ్రామపంచాయతీలో ఫిష్ పాండ్ల ఏర్పాటుకు అంచనాల తయారుచేసి పనులు వెంటనే ప్రారంభించాలని స్థానిక ఎంపిడిఓ గార్లపాటి జ్యోతిలక్ష్మి కోరారు. బుధవారం స్థానిక మండల సమావేశం హాలులో గ్రామపంచాయతి కార్యదర్శుల, జాతీయ గ్రామీణ ఉపాధి సిబ్బంది సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ
ఉపాధీ హామి పథకంలో ప్రతి పనిని కొలతలు ప్రకారం చేయించి ఉపాధి హామీ కూలీల దినసరి వేతనం 272 రూపాయలు పడే విధంగా పని చేయాలన్నారు. పంచాయతి కార్యదర్శులు గ్రామంలో శానిటేషన్ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. డిఎస్ఆర్ అటెండెన్స్ ఉదయం9 గంటల లోపు పూర్తి చేయాలన్నారు.
గ్రామాల్లోని నర్సరీలలో వంద శాతం మొలకెత్తేలా ఉండాలన్నారు. క్రీడా ప్రాంగణాల స్థలాలను మిగతా గ్రామపంచాయతీలలో ఎంపిక చేయవలెను.
రానున్నది వేసవికాలం కాబట్టి గ్రామపంచాయతీలలో ఎటువంటి నీటి సమస్య లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమావేశం లో ఎంపిఓ టి.వీరారెడ్డి, ఉపాధి ఇంచార్జి ఎపిఓ కళావతి, పంచాయతీ కార్యదర్శులు ఫీల్డ్ అసిస్టెంట్ లు పాల్గొనైనది.