జర్నలిస్ట్ రవి వాల్మీకి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి

జర్నలిస్ట్ రవి వాల్మీకి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి

మందమర్రి, అక్షిత ప్రతినిధి):

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇటీవల మృతి చెందిన పట్టణానికి చెందిన జర్నలిస్ట్ రవి వాల్మీకి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ, ఆదుకోవాలని రామకృష్ణాపూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మిట్టపల్లి సంతోష్ కుమార్, ప్రధాన కార్యదర్శి పిల్లి రవి కిరణ్ లు కోరారు. రామకృష్ణాపూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని రవి వాల్మీకి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా రవి వాల్మీకి చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించి, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఆయన దశదిన కార్యక్రమానికి సహాయంగా 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రవి వాల్మీకి కుటుంబానికి రామకృష్ణాపూర్ ప్రెస్ క్లబ్ కమిటీ అన్నివేళలా అండగా ఉంటుందని తెలిపారు. తమ మిత్రుడు తోటి జర్నలిస్ట్ తమ ముందు ఇక లేరు అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడు ప్రజా సమస్యలపై పోరాడుతూ, వార్త సేకరణ చేసేవారని, అతికొద్ది కాలంలోని ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికీ తీసుకెళ్లి ప్రజలు మన్ననలు పొందిన వ్యక్తి రవి వాల్మీకి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కోశాధికారి బుచ్చిబాబు, ఉపాధ్యక్షులు ఎర్రవెల్లి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి వేల్పుల కిరణ్ కుమార్, ప్రచార కార్యదర్శి సతీష్, సభ్యులు కూరపాటి శ్రీనివాస్, డోలకుల సంతోష్ కుమార్, మారపల్లి సాయి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking