బిజేవైఎం ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం ప్రారంభించిన ఎస్సై స్రవంతి రెడ్డి

బిజేవైఎం ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం ప్రారంభించిన ఎస్సై స్రవంతి రెడ్డి

ఖమ్మం/ అక్షిత బ్యూరో :

బిజేవైఎం జాతీయ రాష్ట్ర కమిటీ ల పిలుపు మేరకు ఖమ్మం జిల్లా భారతీయ జనతా యూవమోర్చా జిల్లా అధ్యక్షుడు అనంతు ఉపేందర్ గౌడ్ ఆధ్వర్యంలో నేలకొండపల్లి మండలం బోదులుబండ గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని నేలకొండపల్లి స్రవంతి రెడ్డి తో కలిసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎస్సై స్రవంతి బిజేవైఎం జిల్లా అధ్యక్షులు అనంత ఉపేందర్ మాట్లాడుతూ ఆరోగ్యమే మాహా భాగ్యమని 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు వైద్య సలహాలు పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలన్నారు.ఈ మెడికల్ క్యాంపు పెట్టిన గ్రామ శాఖకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ యొక్క ఉచిత వైద్య శిబిరానికి సహకరించిన శ్రీ రక్షా హాస్పిటల్ యాజమాన్యానికి డాక్టర్ జీవీ డాక్టర్ సాయి లకు హస్పిటల్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ఈ వైద్య శిబిరాలు జరుగుతున్నాయని అన్నారు.ఈ ఉచిత వైద్య శిబిరంలో బీపీ షుగర్ బిఎంఐ మరియు అనేక టెస్టు లు నిర్వహించామన్నారు.ఈ కార్యక్రమంలో బిజేవైఎం మండల అధ్యక్షుడు మర్రి శివ బోదులబండ బీజేపీ నాయకులు మొయినుద్దీన్ చల్లా మల్లేష్ కసాని ఉదయ్ మల్లెల శ్రీనివాస్ చారి బాలు శ్రీకాంత్ నవీన్ మహేష్ వీరబాబుగ్రామ పెద్దలు శేషగిరి బురా వీరయ్య గుండు శ్రీను తాటికొండ నాగేశ్వరరావు నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking