పారదర్శకంగా క్వార్టర్ల కౌన్సెలింగ్
మందమర్రి, అక్షిత ప్రతినిధి:
ఏరియాలోని ఖాళీగా ఉన్న క్వార్టర్ల కేటాయింపు కొరకు సింగరేణి ఎన్సీడబ్యుఏ ఉద్యోగులకు పారదర్శకంగా కౌన్సెలింగ్ నిర్వహించినట్లు ఏరియా సింగరేణి అధికారులు పేర్కొన్నారు. బుధవారం ఏరియాలోని సిఈఆర్ క్లబ్ లో క్వార్టర్ల కొరకు దరఖాస్తు చేసుకున్న కార్మికులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏరియా ఎస్ఓటు జిఎం ఓదెలు, కేకే గ్రూప్ ఏజెంట్ రాందాస్, ఏరియా పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్ లు మాట్లాడుతూ, ఏరియాలో ఖాళీగా ఉన్న క్వార్టర్ల కేటాయింపు కొరకు 61క్వార్టర్ లను ప్రకటించగా, వీటికి 106మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారని, దరఖాస్తు చేసుకున్న కార్మికులకు కౌన్సిలింగ్ నిర్వహించి, సీనియార్టీ ప్రకారం 24 మంది కార్మికులకు క్వార్టర్లను కేటాయించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివైఎస్ఈ (ఐఈడి) ఫణి కుమార్, సీనియర్ పిఓ ఎండీ ఆసిఫ్, పర్సనల్ విభాగం ఓఎస్ రాజలింగు, ఏరియా పర్సనల్ విభాగం సిబ్బంది, ఎస్ అండ్ పిసి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.