ఏర్పాట్లు పూర్తి-కలెక్టర్

ఏర్పాట్లు పూర్తి-కలెక్టర్

భద్రాద్రి కొత్తగూడెం అక్షిత ప్రతినిధి:

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు జిల్లాలోని 5 నియోజకవర్గాల నుండి ప్రజలను పంపుటకు అన్ని
ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. బుధవారం హైదరాబాదు నుండి సిఎస్ శాంతికుమారి
ఏర్పాట్లుపై టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 5 నియోజకవర్గాల నుండి
1500 మందిని పంపుటకు జాబితా సిద్ధం చేసినట్లు చెప్పారు. జిల్లా నుండి 26, మహాబూబాబాద్ నుండి రెండు,
ములుగు జిల్లా నుండి రెండు బస్సులు పంపుటకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. ప్రయాణంలో అల్పాహారం,
బోజనాలు ఏర్పాట్లుకు ప్రత్యేకంగా జిల్లా అధికారులను, తహసిల్దార్లను నియమించినట్లు చెప్పారు. హైదరాబాదుకు
సుదూరంగా ఉన్న భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట నియోజకవర్గాల నుండి ప్రజలు బయలుదేరుటకు 13వ తేదీ
రాత్రి నియోజకవర్గ తహసిల్దార్ కార్యాలయాల్లో బస్సులు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
వేసవి దృష్ట్యా ప్రయాణంలో ఎలాంటి ఇబ్బంది రాకుండా మంచినీరు, మజ్జిగ, స్నాక్స్ పాటు అత్యవసర మందులను
అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. బోజనాలు ఏర్పాటు చేసిన నార్కెట్పల్లి, శబరి గార్డెన్లో అత్యవసర చికిత్సా
కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సభా ప్రాంగణానికి మద్యాహ్నం ఒంటి గంట వరకు చేరుకునే విధంగా చర్యలు
తీసుకొన్నట్లు చెప్పారు. బస్సులకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వెళ్తున్న ప్రజలకు గుర్తింపు కార్డులు జారీ
చేస్తున్నామని చెప్పారు. తీసుకెళ్లడంతో పాటు తిరిగి చేరే వరకు అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికారులకు ఆదేశాలు
జారీ చేసినట్లు చెప్పారు. పర్యవేక్షణకు ప్రతి బస్సులో ఇద్దరు అధికారులను పంపిస్తున్నట్లు చెప్పారు. 14వ తేదీ
ఉదయం 4 గంటలకు బస్సులు బయలు దేరే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ టెలి కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిఆర్డీ అశోకచక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking