సీ.ఎం. రిలీఫ్ ఫండ్ తో ఎంతో మంది పేదలకు లబ్ది. సుదీర్ రెడ్డి పేద ప్రజలకు నాణ్యమైన అధునాతన వైద్య సేవలు పొందేందుకే సీఎం సహాయ నిధి:
సీ.ఎం. రిలీఫ్ ఫండ్ తో ఎంతో మంది పేదలకు లబ్ది. సుదీర్ రెడ్డి
పేద ప్రజలకు నాణ్యమైన అధునాతన వైద్య సేవలు పొందేందుకే సీఎం సహాయ నిధి:
ఎల్బీనగర్ ,అక్షిత ప్రతినిధి:
బాధిత కొడుకు గోపికృష్ణకు 1,50,000 రూపాయల ఎల్.ఓ.సీ. గురువారం, క్యాంపు కార్యాలయంలో ఆందజేస్తున్న ఎల్.బి.నగర్ శాసనసభ్యులు
దేవిరెడ్డి సుదీర్ రెడ్డి.
నాగోల్ డివిజన్ పరిధిలోని అరుణోదయ కాలనీకు చెందిన లక్ష్మినారాయణ వెన్నెముక సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో అయితే వారి యొక్క ఆర్థికస్థితులు బాగలేక వారు వారి యొక్క కుటుంబసభ్యులు ఎల్.బి. నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి
సుదీర్ రెడ్డి సంప్రదించారు. వెంటనే స్పందించిన సుదీర్ రెడ్డి అట్టి ఆపరేషన్ కు కావలసిన డబ్బుల వివరాలను ముఖ్యమంత్రి సహాయనిదికి దరఖాస్తు చేయడం జరిగింది.దానికి గాను వారికి 1,50,000(ఒక లక్ష యాబై వేల రూపాయలు) ఎల్.ఓ.సీ.చెక్కు మంజూరు కావడం జరిగింది. ఈ సందర్భంగా సుదీర్ రెడ్డి మాట్లాడుతూ. పేదల ఆరోగ్య పరిరక్షణకు సీ.యం. సహాయనిధి దోహదపడుతుంది అని అన్నారు. ఈ పథకం పేదలకు ఓ వరం లాంటిది అని అన్నారు. పేద ప్రజలకు నాణ్యమైన అధునాతన వైద్య సేవలను పొందేందుకు సీ.ఎం. సహాయనిది అండగా ఉంటుంది అని అన్నారు. ఎల్.బి.నగర్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం పనిచేస్తాను అని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఆనంతుల రాజిరెడ్డి, డివిజన్ బారాస అధ్యక్షులు తూర్పాటి చిరంజీవి పాల్గొన్నారు.