నవ లిమిటెడ్ సామాజిక సేవలు మరువలేనివి * పాల్వంచ డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ఎన్.వెంకటేష్ * ప్రభుత్వ పాఠశాలలలో డిజిటల్ తరగతులు ప్రారంభం
నవ లిమిటెడ్ సామాజిక సేవలు మరువలేనివి
* పాల్వంచ డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ఎన్.వెంకటేష్
* ప్రభుత్వ పాఠశాలలలో డిజిటల్ తరగతులు ప్రారంభం
భద్రాద్రి కొత్తగూడెం అక్షిత ప్రతినిధి:
నవ లిమిటెడ్ పాల్వంచ “కార్పొరేట్ సామాజిక బాధ్యత” కార్యక్రమాలలో భాగంగా పాల్వంచ పరిధిలోని పూనుకుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్ ఎక్విప్మెంట్ తరగతులను పాల్వంచ డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ఎన్.వెంకటేష్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవ లిమిటెడ్ సంస్థ ఉత్పత్తి ప్రారంభించిన నాటి నుండే మారుమూల ప్రాంతాలలో అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తూ ముఖ్యంగా “విద్యాభివృద్ధికి” తరగతి గదుల ఏర్పాటు బాలబాలికలకు వేరువేరుగా వాష్రూమ్స్ మొబైల్ సైన్స్ లాబరేటరీ సప్లమెంటరీ స్పోకెన్ ఇంగ్లీష్ ఉచిత ట్యూషన్స్ కంప్యూటర్ టీచర్ల ఏర్పాటు జంట బల్లల వితరణ మొదలైన కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. నవ లిమిటెడ్ వారు కల్పిస్తున్న సదుపాయాలను ఉపయోగించుకొని ఉన్నత స్థానానికి ఎదగాలని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు.

అలాగే మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల ఎర్రగుంట నందు డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్ ఎస్.చక్రవర్తి ముఖ్యఅతిథిగా విచ్చేసి డిజిటల్ తరగతిని ప్రారంభించారు. అంతేకాకుండా 35 స్టూడెంట్ డెస్క్ లను పాఠశాలకు అందించారు. ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతాలలో విద్యాభివృద్ధికి నవ లిమిటెడ్ చేస్తున్న కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో సిజిఎం పి.రమేష్ జి.యం( సివిల్) ఎంజీఎం ప్రసాద్ చీఫ్ లైసెన్ ఆఫీసర్ వి.ఖాదరేంద్రబాబు వి.శ్రీనివాస్ డి.శ్యాంసుందర్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ సి.ఎస్.ఆర్ సిబ్బంది పాఠశాలల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.