గుడిసేవాసుల గోస తీర్చుతున్న ఎమ్మేల్యే నన్నపునేని నరేందర్కార్పొరేటర్ సురేష్ జోషి ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికిన గుడిసేవాసులు*
గుడిసేవాసుల గోస తీర్చుతున్న ఎమ్మేల్యే నన్నపునేని నరేందర్కార్పొరేటర్ సురేష్ జోషి ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికిన గుడిసేవాసులు*
వరంగల్,అక్షిత బ్యూరో : వరంగల్ తూర్పు నియోజవర్గంలో గుడిసెవాసుల పండుగ జరుగుతున్నట్టుగా 43 గుడిసేవాసులు నివాసముండే కాలనిలలో పండగ వాతావరణం నెలకొన్నది ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ జీవో 58,59 అమలుపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారికున్న అపోహలను నివృత్తి చేస్తూ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తున్నారు
అందులో భాగంగా
నేడు 13వ డివిజన్ కార్పొరేటర్ సురేష్ జోషి ఆధ్వర్యంలో ఎం.హెచ్.నగర్ లో ఏర్పాటు చేసిన జీవో 58,59 అమలుపై జనరల్ బాడీ సమావేశానికి గుడిసేవాసులు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ గారికి పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.

దారిపొడవునా కోలాటలతో,పూలు చల్లుతూ ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికి వారి కాలనీకి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తాను మేయర్ గా ఉన్నప్పుడు 2016లో గుడిసె ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలకు ముందస్తుగా సకల సదుపాయాలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చామని ఆ హామీని నెరవేర్చి ప్రతి ఇంటికి మిషన్ భగీరద ద్వారా మంచినీరు,విద్యుత్తు,సీసీ రోడ్లు,డ్రైనేజీ, ఇంటి నెంబర్ ఇచ్చామని చివరగా మీకు పట్టాలందించి మీ గుడిసెకు మిమ్మల్ని హక్కుదారులను చేస్తానని ఎమ్మెల్యే అన్నారు
గత కాంగ్రెస్ పాలకులు ఇక్కడ మీ గుడిసెలని తీసేయ్యడం,కాల్చేయడం చేసే వారని వారికి ప్రజలపై ప్రేమ లేకపోగా తీవ్ర ఇబ్బందులకు గురిచేసారని ఎమ్మెల్యే అన్నారు
అలాంటి వారు నేడు ఎం మొఖం పెట్టుకొని మీ దగ్గరికి వస్తున్నారో మిరే నిలదీసి అడగాలన్నారు
కరోనా కష్టకాలంలో ప్రజలకు చేదోడువాదోడుగా ఉండి 25వేల మందికి నిత్యావసర సరుకుల పంపిణీ చేశామని మీ కార్పొరేటర్ సురేష్ జోషి అత్యవసర నిమిత్తం ప్రజలకు రేమిడిసివర్ ఇంజెక్షన్స్ కోసం నన్ను తరచుగా సంప్రదించే వారని జోషి కూడా సాధ్యమైనంత మేర కరోనా కష్టకాలంలో ఆదుకున్నాడన్నారు
నిరుపేదనైన తనకు కార్పొరేటర్, మేయర్,ఎమ్మెల్యే చేసారని మీ రుణం తిర్చుకుంటానని ప్రజల ఆర్థికాభివృద్ధి ద్యేయంగా నిరంతరం పని చేస్తున్నామన్నారు
విద్య కోసం 7 గురుకులాలు ఏర్పాటు చేసుకున్నామని,వైద్యం కోసం దేశంలోనే ఎక్కడ లేని విదంగా 24 అంతస్థుల దవాఖానను నిర్మిస్తున్నామని అతి త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు
వాడవాడన సిసి రోడ్లు,పేదల మధ్య కోట్లాది కలెక్టరేట్ ఏర్పాటు చేసుకుంటున్నామని,జిల్లా కేంద్రం సాదించుకున్నాం,కూరగాయల మార్కెట్,పండ్ల మార్కెట్ తో పాటు దేశాయిపేట రోడ్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామని ఎమ్మెల్యే అన్నారు.
ప్రతి ఇంట్లో సంక్షేమం ప్రతి మోమున సంతోషం అందించడమే కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యమని అందుకే ఆసరా పెన్షన్,కల్యాణ లక్ష్మీ,షాది ముబారక్, రైతు బంధు,రైతు బీమా,కేసీఆర్ కిట్ తో పాటు ఎన్నో సంక్షేమ పథకాలను బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తుందని పేదలను కడుపులో పెట్టుకుని చూసుకునే నాయకత్వం బిఆర్ఎస్ నాయకత్వమని ఎమ్మెల్యే అన్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇంనేడ్లు కనిపించని మొఖాలు ఇప్పుడు మీకు దర్శనమిస్తాయని వారందరినీ మీకు ఎం చేసారో నిలదీసి అడగాలని కరోనా కష్టకాలంలో వారందరూ ఎక్కడ ఉన్నారని ఎమ్మెల్యే ప్రశ్నించారు
నిరుపేదలైన అర్హులందరికి పట్టాలను ఇచ్చే జిమ్మేదారి తనదేనని ఎమ్మెల్యే అన్నారు
నిక్కచ్చిగా కేసీఆర్ కోసం,బిఆర్ఎస్ కోసం నిలబడండి మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సురేష్ జోషితో పాటు,35డివిజన్ కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్,58,59 జీవో బాద్యులు మర్రి శ్రీనివాస్,నాగేశ్వరరావు,కొత్తపెళ్లి స్వామి,కంచె రాజు,ఎండి రఫీద్,అభివృద్ధి కమిటీ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.