జానాను పరామర్శించిన మండల నాయకులు

జానాను పరామర్శించిన
మండల నాయకులు

అక్షిత ప్రతినిధి, వేములపల్లి :

మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అస్వస్థకు గురై అపోలో హాస్పిటల్ చేరి వైద్య ఆరోగ్య పరీక్షలు చేయగా జానారెడ్డి ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందనితెలుసుకున్న వేములపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పీసీసీ సభ్యులు చిరుమర్రి కృష్ణయ్య ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి వెళ్లి జానారెడ్డి కలిసిపరామర్శించారు.కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తన ఆరోగ్యం నిలకడగా ఉందని త్వరలోనే మిర్యాలగూడకు వచ్చి అందరిని కలుసుకుంటానని అన్నట్లు తెలిపారు.జనారెడ్డి ని కలిసిన వారిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కండిమల్ల లక్ష్మారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాలి కాంతరెడ్డి కిసాన్ సెల్ అధ్యక్షుడు తంగేళ్ల సత్తిరెడ్డి ఎస్సీ సెల్ అధ్యక్షుడు పుట్టల వెంకన్న కొమ్ము మిర్యాలగూడ మండల మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బసవయ్య గౌడ్ తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking