చీమలపాడు ఘటన క్షతగాత్రులను పరామర్శించిన మంత్రులు కేటిఆర్, పువ్వాడ
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం చీమలపాడు అగ్నిప్రమాద ఘటనలో క్షతగాత్రులైన వారిని మెరుగైన చికిత్స కోసం ఖమ్మం నుండి హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు.గురువారం ఐటి పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎంపిలు నామా నాగేశ్వరరావు వద్ధిరాజు రవిచంద్ర నిమ్స్ ఆసుపత్రికి వెళ్ళి క్షతగాత్రులను కలిసి పరామర్శించారు.ఏమి అధైర్య పడొద్దని వారి కుటుంబాలు ధైర్యం కల్పించారు.పూర్తిగా కోలుకునే వరకు అన్ని రకాల వైద్య చికిత్సలు ఉచితంగానే అందిస్తామని దైర్యం కోల్పోవొద్దు దైర్యం చెప్పారు.ఎలాంటి వైద్య సేవలైన తక్షణమే అందించాలని పూర్తిగా కోలుకునేవరకు మెరుగైన చికిత్సలను అందించాలని వైద్యులను నిమ్స్ అధికారులను మంత్రులు అదేశించారు.