* అంతర్జాతీయ స్థాయిలో కబడ్డీ పోటీల్లో ద్వితీయ స్థానం సాధించిన సుధా శర్మ *సోషల్ సర్వీజ్ ఆర్గనైజర్ హమీద్ షేక్ ప్రత్యేక చొరవతో ఆమెకు రూ.50వేలు ఆర్థిక సాయం అందించిన మంత్రి కేటీఆర్

* అంతర్జాతీయ స్థాయిలో కబడ్డీ పోటీల్లో ద్వితీయ స్థానం సాధించిన సుధా శర్మ

*సోషల్ సర్వీజ్ ఆర్గనైజర్ హమీద్ షేక్ ప్రత్యేక చొరవతో ఆమెకు రూ.50వేలు ఆర్థిక సాయం అందించిన మంత్రి కేటీఆర్

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన సుధా శర్మ నేపాల్ లోని ఫోఖ్రాలో జరిగిన అంతర్జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో అంతర్జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచింది. కబడ్డీ క్రీడలో ప్రతిభ ఉన్నప్పటికీ ఆమెకు అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. దాతల సాయం కోసం ఆమె తండ్రి, మిర్యాలగూడ పట్టణంలో గతంలో ఆర్టిస్టుగా పని చేసిన హరి పలువురు దాతలను సాయం కోసం అర్థించారు. నేపాల్ కు వెళ్లి అంతర్జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొనేందుకు రూ.50 వేలు ఆర్థిక సాయం కోసం పలువురు ప్రజాప్రతినిధులను, దాతలను ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. ఈ విషయాన్ని నల్లగొండ జిల్లా ప్రఖ్యాత సోషల్ సర్వీస్ ఆర్గనైజర్, హ్యూమన్ రైట్స్ డిఫెండర్ హమీద్ షేక్ దృష్టికి తీసుకొచ్చారు. హరి అభ్యర్ధనపై స్పందించిన హమీద్ షేక్. కబడ్డీ క్రీడలో సుధా శర్మ ప్రతిభ గురించి మంత్రి కేటీఆర్ కు తెలియజేశారు. ఆమెకు రూ.50,000 ఆర్ధిక సాయం అందించాలని మంత్రి కేటీఆర్ ను కోరిన అరగంటలోపే క్రీడాకారిణి ఖాతాలో మంత్రి కేటీఆర్ కార్యాలయం రూ50వేలు జమ చేసింది. క్రీడాకారిణి సుధా శర్మ నేపాల్ కు వెళ్లే మార్గం సుగమం చేసింది. రామన్న ఆర్థిక సాయం ద్వారా ఆమె నేపాల్ లోని ఫోఖ్రాలో జరిగిన అంతర్జాతీయ కబడ్డీ పోటీల్లో ద్వితీయ స్థానం సాధించి తెలంగాణ రాష్ట్రం ఖ్యాతిని, మంత్రి కేటీఆర్ పేరును నిలబెట్టడంతో పాటు తల్లిదండ్రుల చిరకాల ఆకాంక్షను సుధా శర్మ నిలనెట్టింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking