రైతు సంక్షేమమే ధ్యేయం: ఎంపీపీ గుండగాని కవితా రాములు గౌడ్ డీసీసీబీ డీసీఎంఎస్ డైరెక్టర్ గుడిపాటి సైదులు
రైతు సంక్షేమమే ధ్యేయం:
ఎంపీపీ గుండగాని కవితా రాములు గౌడ్
డీసీసీబీ డీసీఎంఎస్ డైరెక్టర్ గుడిపాటి సైదులు
తుంగతుర్తి, అక్షిత :
రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయంగ రైతు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తుందని తుంగతుర్తి ఎంపీపీ గుండగాని కవిత రాములు గౌడ్ అన్నారు. గురువారం మహిళ సంఘాల ఆధ్వర్యంలో మండల పరిధిలోని మంచ్య తండా, రామన్నగూడెం, దేవుని గుట్ట తండా, వెంపటి, రావులపల్లి, గొట్టిపర్తి, వెలుగుపల్లి, సింగారం తండా, కేశవపురం, కొత్తగూడెం, అన్నారం, తుంగతుర్తి గ్రామాలలో నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ఆదేశాల మేరకు యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ గుండగాని కవిత రాములు గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…. రైతుల శ్రేయస్సు , సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని రైతు బీమా, రైతు బంధు,24 గంటల ఉచిత విద్యుత్, సబ్సిడీపై ఎరువులు, వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.వ్యవసాయం అంటే దండగా కాదు వ్యవసాయం అంటే పండగ అని కాలేశ్వరం జలాలతో నిరూపించిన నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు.

ప్రతి ఒక్క రైతు ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన గ్రేడ్ ఏ రకం ధాన్యానికి క్వింటాల్ కు 2060/-, సాధారణ రకం ధాన్యం క్వింటాలుకు 2040/- మద్దతు ధర పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు, వైస్ ఎంపీపీ మట్టపల్లి శ్రీశైలం యాదవ్, ఎంపీడీవో భీమ్ సింగ్ నాయక్, ఏపిఎం నర్సయ్య, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య, జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్, బీఆర్ఎస్ పార్టీ మహిళా మండల అధ్యక్షురాలు తునికి లక్ష్మమ్మ, గోపగాని శ్రీనివాస్, గాజుల యాదగిరి, చెరుకు పరమేష్,సీసీలు కొమ్ము ఇద్దయ్య, గడ్డం గిరి, నర్సింగ నాయక్, నర్మద,ఏఈఓ లు సృజన, ప్రసన్న, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు గ్రామ కార్యదర్శులు, సంఘ బంధం సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.