నిరుపేద ముస్లిమ్ ప్రజలకు రంజాన్ తోఫా అందజేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.
రాజేంద్రనగర్ అక్షిత ప్రతినిధి: ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద మైనార్టీ ప్రజలకు రంజాన్ కానుకగా బట్టల పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది అందులో భాగంగానే గురువారం శాస్త్రపురం డివిజన్ పరిధిలోని నిరుపేద ముస్లిం ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రంజాన్ పండుగ పురస్కరించుకొని బట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల ప్రజల పండగలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత నిస్తుందని ఆయన గుర్తు చేశారు. అటు క్రిస్టియన్లకు క్రిస్మస్ బట్టల పంపిణీ ఇటు రంజాన్ పండుగ కు ప్రజలకు బట్టలు పంపిణీ తో పాటు బతుకమ్మ పండుగకు ఆడపడుచులకు చీరల పంపిణీ వంటి కార్యక్రమాలను చేపడుతుందని ఆయన అన్నారు. ప్రజలు ఊహించని విధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే చెందుతుందని ప్రకాష్ గౌడ్ పేర్కొన్నారు. పవిత్ర మాసంలో పేద ముస్లిం కుటుంబాలకు సహాయం చేయడం ఎంతో సంతృప్తిని ఇస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ‘రంజాన్‘ మాసంలో పేద ముస్లింలకు ‘రంజాన్ కానుకలు అందిస్తోందని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన ముస్లింలకు రంజాన్ కానుకల రూపంలో దుస్తులు, ఇతర నిత్యావసరాలు అందిస్తుందని వెల్లడించారు. అర్హులైన లబ్ధిదారులందరికీ మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో బహుమతుల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలతో పాటు మైనార్టీ విభాగం నాయకులు మత పెద్దలు పాల్గొన్నారు.