కమ్యూనిటీ నిర్మాణం పనులు పరిశీలించిన మేయర్ మహేందర్ గౌడ్.

కమ్యూనిటీ నిర్మాణం పనులు పరిశీలించిన మేయర్ మహేందర్ గౌడ్.

రాజేంద్రనగర్, అక్షిత ప్రతినిధి: బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 22వ వార్డులో గల వినాయక్ నగర్ కాలనీలో నూతనంగా నిర్మించ తలపెట్టిన కమ్యూనిటీ హాల్ నిర్మాణం పనులను గురువారం మేయర్ బుర్ర మహేందర్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి తీర్మానించడం మే కాకుండా నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు. నిర్మాణం జరుపుతున్న కాంట్రాక్టర్ నిర్మాణాన్ని పూర్తి నాణ్యతతో నిర్మించి సాధ్యమైనంత త్వరలో నిర్మాణాన్ని పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా చూడాలని ఆయన తెలిపారు. అందుకోసం సంబంధిత మున్సిపల్ అధికారులు పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి త్వరగా పనులు పూర్తి జరిగేలా చూడాలని ఆయన అన్నారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణం త్వరగా పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వస్తే ప్రజలకు ఎంతగానో సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా కమ్యూనిటీ హాలు వారికి అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking