ప్రతి కమ్యూనిటీకి తాగునీటి సరఫరా అందించడమే ధ్యేయం:
మేడ్చల్, అక్షిత బ్యూరో:
దుందిగల్ పురపాలక పరది 26.వ వార్డు ప్రణీత్ ప్రణవ్ జెమ్స్ లో గురువారం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇంటింటికి తాగు నీటి సరఫరా.ను కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నేత, కౌన్సిలర్ శంభీపుర్ క్రిష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రిష్ణ మాట్లాడుతూ. ప్రతి కమ్యూనిటీ అభివృద్ధికి ఎల్లవేలలా అందుబాటులో ఉంటూ కృషి చేస్తామన్నారు. ప్రజలకు మెరుగైన మౌళిక సదుపాయాలు కల్పించే దిశగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు విష్ణు వర్ధన్ రెడ్డి, కాలనీ ప్రెసిడెంట్, కాలనీ సభ్యులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు…