కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నలుగుతున్న సర్పంచులు _కరెంటు బుగ్గ కొనలేని పరిస్థితి _గ్రామ సర్పంచ్ ఆది శ్రీనివాస్
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నలుగుతున్న సర్పంచులు
_కరెంటు బుగ్గ కొనలేని పరిస్థితి
_గ్రామ సర్పంచ్ ఆది శ్రీనివాస్
చేర్యాల,ఏప్రిల్ 13 అక్షిత ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలోని గ్రామపంచాయతీలకు బిల్లులు రాక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన నలుగుతున్నామని చేర్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,చుంచనకోట గ్రామ సర్పంచ్ ఆది శ్రీనివాస్ అన్నారు.గురువారం చేర్యాల మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంచాయతీ బిల్లులు రాక అవస్థలు పడుతున్నామని, కరెంటు బుగ్గ కొనాలన్నా కష్టతరంగా ఉందని,సర్పంచులకు నిధులు రావు అప్పులు తీరవని ఆవేదన చెందారు.గత కాంగ్రెస్ పాలనలో ఇలాంటి పరిస్థితులు లేవని, బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో సర్పంచులకు బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. పేరుకు పెద్దరికమైన సర్పంచుల పరిస్థితి నేడు అధ్వానంగా మారిందని,ఎవరికి చెప్పుకోవాలో ఎవరికి చెప్పుకోవద్దు చెప్తే పరువు పోతుందని చెప్పలేకపోతున్నామని అన్నారు.2018 పంచాయతీ రాజ్ నూతన చట్టం తర్వాత సర్పంచ్ల పై పనిపారం బాధ్యత భారీగా పెంచారని, తీరిక లేకుండా అధికారులు ప్రతినిత్యం ఏదో ఒక పని పూర్తి చేస్తున్నారని,పనికి తగ్గట్టు నిధులు ఇవ్వడం లేదు, అధికారులను నిధులు అడుగుతుంటే మాకేం తెలవదు అని చేతులెత్తేస్తున్నారు.ఇలా ప్రతి గ్రామాల్లో సర్పంచుల పరిస్థితి ఏర్పడిందని అన్నారు.ఈ కార్యక్రమంలో మద్దూరు మండల జడ్పిటిసి గిరి కొండల్ రెడ్డి, చేర్యాల మున్సిపల్ కౌన్సిలర్లు ముత్యాల తార యాదగిరి, చెవిటి లింగం, సందుల సురేష్,లీలా సంజీవులు మరియు ఆకునూరు ఎంపిటిసి సుంకరి శ్రీధర్ గౌడ్,నాయకులు అత్త రమ్మద్ బుడిగ రమేష్,వెలగల దుర్గయ్య కాటం శ్రీను,మధు, బాలస్వామి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.