అంబేద్కర్ కి ఘనంగా నివాళులర్పించిన పోలీసు అధికారులు
వరంగల్,అక్షిత బ్యూరో : వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో డాక్టర్ బాబాసాహెబ్ 132వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ. వి రంగనాథ్ ముందుగా బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు ఆలోచనలకు తగ్గట్లుగా మన విధులను కొనసాగించాలని, నిరుపేద వర్గాల ప్రజలకు న్యాయం అందించే విధంగా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ, నిరుపేద వర్గాలకు తగు న్యాయం అందించినాడే అంబేద్కర్ కి నిజమైన నివాళులు అర్పించిన వారమవుతామని పోలీస్ కమిషనర్ తెలియజేశారు.

అంబేద్కర్ కి నివాళులర్పించిన వారిలో క్రైమ్ డిసిపి మురళీధర్, ఈస్ట్ జోన్ డిసిపి కరుణాకర్, అదనపు డిసిపిలు సంజీవ్, సురేష్ కుమార్, ఎసిపిలు అనంతయ్య, సురేంద్ర ఆర్.ఐ లు నగేష్, భాస్కర్, చంద్రశేకర్,ఇన్స్ స్పెక్టర్లు రమేష్ ,కరుణాకర్, జనార్దన్ రెడ్డి, పోలీస్ అధికారుల సంఘం ప్రతినిధి శోభన్ తో పాటు పరిపాలన విభాగం అధికారులు, ఇతర పోలీస్ సిబ్బంది వున్నారు.