DR. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించిన – మొద్దు లచ్చి రెడ్డి
వనస్థలిపురం, అక్షిత ప్రతినిధి: శుక్రవారం,132 వ అంబేద్కర్ జయంతి సందర్భంగా బి యన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని సాహెబ్ నగర్ చౌరస్తా లో అంబేద్కర్ మరియు బాబు జగ్జీవన్ రామ్ ల చౌక్ వద్ద నిర్వహించిన జయంతి వేడుకల్లో బి యన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి మరియు బిజెపి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వనపల్లి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రపంచ మేధావి భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని వేడుకలు జరపడం ఎంతో సంతోషంగారంగా ఉందని మరియు అంబేద్కర్ దళిత వర్గానికి చెందిన ఆయన తన జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. ఇన్ని కష్టాల మధ్య అంచెలంచెలుగా ఎదిగిన అంబేడ్కర్ ఒక గొప్ప ఎకనామిస్ట్గా, జ్యూరిస్ట్గా, సామాజిక కార్యకర్తగా, రాజకీయ నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. భారత రాజ్యాంగాన్ని రచించిన కమిటీకి నాయకత్వం వహించిన ఘనత అంబేడ్కర్ సొంతం. ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రావు, నాయకులు భూపాల్ రెడ్డి, నరసింహారెడ్డి, అంజన్ కుమార్ గౌడ్ , విష్ణువర్ధన్ రెడ్డి, శరత్ కుమార్, శ్రీధర్ రావు , మహేందర్ రెడ్డి, శివశంకర్, శ్రీనివాస్ శర్మ, సుధీర, పవన్ రెడ్డి ,వెంకటేష్, భాను, మరియు గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీ అధ్యక్షురాలు సరస్వతి, పద్మ, రేవతి, సత్య, మరియు అంబేద్కర్ యువజన సంఘం కమిటీ అధ్యక్షులు జగన్మోహన్, గౌరవాధ్యక్షులు గంగం శివశంకర్, ఉపాధ్యక్షులు యంజాల బిక్షపతి, కోశాధికారి కొంగర మహేష్, ప్రధాన కార్యదర్శి గంగం రాజు, సభ్యులు బోరం కృష్ణ, దాసరి బలరాం, కొంగర జంగయ్య, అంజన్ కుమార్, బాబు, మధు, దాసరి రాకేష్, శేఖర్, కృష్ణ, సిద్దేశ్వర మరియు తదితరులు పాల్గొన్నారు.