కొత్తగూడెం ఏరియాలో బాబాసాహెబ్ డాక్టర్ బి‌ఆర్ అంబేడ్కర్ జన్మదిన వేడుకలు

కొత్తగూడెం ఏరియాలో బాబాసాహెబ్
డాక్టర్ బి‌ఆర్ అంబేడ్కర్ జన్మదిన వేడుకలు

భద్రాద్రి కొత్తగూడెం అక్షిత ప్రతినిధి:

కొత్తగూడెం ఏరియా పరిధిలోని రుద్రంపూర్ లో శుక్రవారం భారతరత్న బాబాసాహెబ్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొత్తగూడెం ఏరియా ఇంచార్జ్ జనరల్ మేనేజర్ ఎన్.సుధాకర రావు ముందుగా రుద్రంపూర్ మార్కెట్ ఏరియాలోని గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎస్‌సి అండ్ ఎస్‌టి అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అంతోటి నాగేశ్వరరావు, సింగరేణి ఎస్‌సి అండ్ ఎస్‌టి అసోసియేషన్ లైసన్ ఆఫీసర్స్ అంబేడ్కర్ అభిమానులు పూలమాలలతో అలంకరించారు. అదే విధంగా కొత్తగూడెం ఏరియాలోని అన్ని గనులు డిపార్ట్మెంట్లలో భారతరత్న బాబాసాహెబ్ డా. బి‌ఆర్ అంబేడ్కర్ 132 వ జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది.

అనంతరం రుద్రంపూర్ ఆర్‌సి‌ఓ‌ఏ క్లబ్ నందు సెంట్రల్ ఫంక్షన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికికొత్తగూడెం ఏరియా ఏజిబ‌ఎం సివిల్ సూర్యనారాయణ అధ్యక్షత వహించగా ముఖ్య అతిధిగా కొత్తగూడెం ఏరియా ఇంచార్జ్ జనరల్ మేనేజర్ ఎన్.సుధాకర రావు విచ్చేసారు. ముందుగా కేక్ కట్ చేసిన ఇంచార్జ్ జనరల్ మేనేజర్ ఎన్.సుధాకర రావు అందరికీ భారతరత్న బాబాసాహెబ్ డా. బి‌ఆర్ అంబేడ్కర్ 131 వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ జనరల్ మేనేజర్ ఎన్.సుధాకర రావు మాట్లాడుతూ భారతరత్న బాబాసాహెబ్ డా. బి‌ఆర్ అంబేడ్కర్ ముందుచూపుతో రచించిన రాజ్యాంగాన్ని ఇప్పటికీ మనం పాటిస్తున్నమంటే ఇదే ఆయన గొప్పతనం అని కీర్తించారు. ప్రపంచంలోనే ఆగ్ర నాయకులు కూడా బాబాసాహెబ్ డా. బి‌ఆర్ అంబేడ్కర్ స్మరించుకుని వారిని స్పూర్తి గా తీసుకోవడం జరిగిందని అన్నారు. బాబాసాహెబ్ డా. బి‌ఆర్ అంబేడ్కర్ కన్న కలలను సాకారం చేసే విధంగా అందరం నడుచుకుందామని, అప్పుడే ఆయనకు మనం ఇచ్చే ఘన నివాళి అని అన్నారు. అనంతరం భారతరత్న బాబాసాహెబ్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకల సంధర్భముగా నిర్వహించిన వ్యాస రచన పోటీలలో పాల్గొన్న విద్యార్ధులలో ఎంపిక అయిన ఉత్తమ వ్యాస రచన వ్రాసిన వారికి మొదటి, ద్వితీయ తృతీయ స్థానం 5 గురికి కన్సోలెసన్ బహుమతులకు అందచేశారు.

ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ జనరల్ మేనేజర్ ఎన్.సుధాకరరావు, ఎస్‌సి లైసన్ ఆఫీసర్ కల్వల చంద్రశేఖర్ రావు, ఎస్‌టి లైసన్ ఆఫీసర్ బి.రామదాసు, ఎస్‌సి అండ్ ఎస్‌టి అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అంతోటి నాగేశ్వర రావు, టి‌బి‌జి‌కే‌ఎస్ వైస్ ప్రెసిడెంట్ ఎం‌డి.రజాక్, ఏరియా సి‌ఎం‌ఓ‌ఏ‌ఐ వైస్ ప్రెసిడెంట్ బుడగం రామకృష్ణ, ఏజిర‌ఎం సివిల్ సూర్యనారాయణ, ఏజీఎం పర్సనల్ సామ్యూల్ సుధాకర్, ఇంచార్జ్ ఎస్‌ఓ టు జి‌ఎం కోటి రెడ్డి, పి‌వి‌కే-5 వి‌కే-7 గని ఏజెంట్ రవీందర్, డి‌జి‌ఎంలు వి.వెంకటేశ్వర్లు, యోహన్, సదానందం, ఎస్‌సి అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ బి.వెంకట స్వామి, ఎస్‌సి సెంట్రల్ కమిటీ మెంబర్ అంకుష్, ఎస్‌టిఅసోసియేషన్ సెక్రటరీ వి.హీరాలాల్, ఎస్‌టి అసోసియేషన్ సెంట్రల్ వర్కింగ్ ప్రెసిడెంట్ డి.భీమయ్య, మేనేజర్ క్వాలిటి మదన్ మోహన్, ఎస్‌ఈ(ఈ అండ్ఎం) స్టోర్స్ రత్న ప్రకాష్, ఎస్‌ఈ(ఈ అండ్ ఎం) పర్చేస్ బి.మాధవ్, ఎస్‌ఈ(ఐ‌ఈ) రాధా నాగభూషణం, రెస్క్యూ ఇంచార్జ్ అనంతరామయ్య, సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ రమణా రెడ్డి, ఈ‌ఈ వీరన్న, ఎస్టేట్స్ ఆఫీసర్ తౌర్య, సీనియర్ పి‌ఓ జి.సుధాకర్, అజయ్ కుమార్, సేవ కొ ఆర్డినేటర్ సాగర్, అంబేడ్కర్ విగ్రహ ఫౌండర్ గోడ రమేష్, గుడెల్లి యాకయ్య, సేవా సెక్రటరీలు అనిత, ఆదిలక్ష్మి, అధికారులు, కార్మిక నాయకులు అధిక సంఖ్యలో అంబేడ్కర్ అభిమానులు పాల్గొని జయప్రదం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking